ETV Bharat / sitara

రివ్యూ: మనసును మీటే అందమైన ప్రేమకావ్యం 'జాను'

author img

By

Published : Feb 7, 2020, 2:43 PM IST

Updated : Feb 29, 2020, 12:50 PM IST

ప్రముఖ నటులు శర్వానంద్​, సమంత జంటగా నటించిన చిత్రం 'జాను'. తమిళ హిట్​ చిత్రం '96'కు ఇది రీమేక్​. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్​ టాక్​ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రంలో కొన్ని విశేషాలతో రివ్యూ మీకోసం..

JAANU MOVIE REVIEW
రివ్యూ: మనసుని హత్తుకొనే అందమైన ప్రేమకథ 'జాను'

పొరుగున విజ‌య‌వంత‌మైన క‌థ‌ల్ని తెచ్చుకుని రీమేక్ చేయ‌డం మామూలే. అయితే క్లాసిక్ అనిపించుకున్న సినిమాల్ని రీమేక్ చేయ‌డానికి మాత్రం వెన‌కాడుతుంటారు నిర్మాత‌లు. త‌మిళంలో క్లాసిక్‌గా నిలిచిపోయిన సినిమా '96'. ఆ సినిమాను ఎంతో ఇష్టప‌డి తెలుగులో 'జాను' చిత్రంగా రీమేక్ చేశాడు దిల్‌రాజు. అతని నిర్మాణంలో రూపొందిన తొలి రీమేక్ ఇదే.

మాతృక‌ (ఒరిజినల్​)ను తెర‌కెక్కించిన ద‌ర్శకుడే ఈ సినిమా బాధ్యత‌ల్ని తీసుకున్నాడు. ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోగ‌ల స‌మంత‌, శ‌ర్వానంద్ జంట‌గా న‌టించారు. మ‌రి మాతృక‌లోని మ్యాజిక్ పునరావృత‌మైందా? 'జాను' ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం.

క‌థేంటంటే:
కె.రామ‌చంద్ర అలియాస్ రామ్ (శ‌ర్వానంద్‌) వృత్తిరీత్యా ట్రావెల్ ఫొటోగ్రాఫ‌ర్‌. అత‌ను వృత్తిలో భాగంగా త‌ను పుట్టి పెరిగిన విశాఖప‌ట్నం వెళ‌తాడు. త‌న స్కూల్‌ని మ‌రోసారి చూసి పాత జ్ఞాప‌కాల్ని నెమ‌రువేసుకుంటాడు. అప్పుడే త‌న స్నేహితులంతా క‌లిసి పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకుంటారు. అలా వారందరూ హైద‌రాబాద్‌లో క‌లుసుకుంటారు. ఆ కార్యక్రమానికి జాన‌కిదేవి అలియాస్ జాను (స‌మంత‌) కూడా సింగ‌పూర్ నుంచి వ‌స్తుంది.
రామ్‌, జాను ప‌దో త‌ర‌గ‌తిలోనే ప్రేమ‌లో ప‌డ‌తారు. కానీ అనుకోకుండా విడిపోతారు. మ‌ళ్లీ క‌ల‌వ‌రు. దాదాపు 17 ఏళ్ల త‌ర్వాత క‌లిసిన వాళ్లిద్దరూ... త‌మ తొలిప్రేమ గురించి ఏం మాట్లాడుకున్నారు? అన్ని సంవత్సరాల త‌ర్వాత వాళ్ల జీవితాల్లో వ‌చ్చిన మార్పులు ఎలాంటివి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ప్రేమ‌క‌థ‌లు ఎక్కువగా న‌వ‌తరానికే న‌చ్చుతుంటాయి. తెర‌పై క‌నిపించే పాత్రలతో క‌నెక్ట్ అయ్యేది వాళ్లు మాత్రమే. కొన్ని ప్రేమ‌ క‌థ‌లు మాత్రం వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రికీ చేరువయ్యేలా ఉంటాయి. అలాంటి ప్రేమ‌క‌థే.. 'జాను'. తొలి ప్రేమలోని మ‌ధురానుభూతుల్ని పంచే చిత్రమిది. చిన్ననాటి జ్ఞాప‌కాల్ని గుర్తు చేస్తూ, గ‌డిచిపోయిన జీవితంలోకి మ‌రోసారి తీసుకెళుతుంది. 'నిన్నటి నువ్వు ఇదే' అని మ‌రోసారి మ‌న‌ల్ని మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తుంది.

>> రీమేక్ సినిమా అంటే క‌చ్చితంగా మాతృక‌తో పోల్చి చూస్తుంటారు. మాతృక త‌ర‌హాలోనే రీమేక్‌లోనూ మ్యాజిక్ చేసే క‌థ‌లు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఇదొక‌టి. చిన్ననాటి స్నేహితుల మ‌ధ్య ఉన్నామంటే ఆ వాతావ‌ర‌ణం ఎంత స‌ర‌దాగా ఉంటుందో చూపిస్తూ.. ఆ నేప‌థ్యంలో న‌వ్విస్తూ.. తొలి ప్రేమ చేసిన తీపి గాయాల‌తో హృద‌యాల్ని బ‌రువెక్కిస్తూ ముందుకు సాగుతుందీ చిత్రం.

>> క‌థానాయ‌కుడు త‌న స్కూల్‌లోకి అడుగుపెట్టిన‌ప్పట్నుంచే సినిమా భావోద్వేగ‌భ‌రితంగా మారిపోతుంది. అర్జెంటుగా బ‌య‌టికెళ్లి మ‌న స్కూల్‌ని ఒక‌సారి చూసొద్దాం అనిపించేలా ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తుంది.

>> పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం కోసం వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేయ‌డం, అందులో ఒకొక్కరు ఒక్కో ర‌కంగా స్పందించ‌డం, అంద‌రూ ఒక చోట క‌ల‌వ‌డం, అక్కడ వాతావ‌ర‌ణం స‌ర‌దాగా మారిపోవ‌డం లాంటి స‌న్నివేశాల‌తో సినిమా చ‌క్కటి వినోదాన్ని పంచుతుంది.

>> రామ్‌, జానుల ప్రేమ‌క‌థ తొలిప్రేమ రోజుల్లోకి తీసుకెళుతుంది. విరామం స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలు హృద‌యాల్ని బ‌రువెక్కిస్తాయి. రామ్ గురించి ఒక విష‌యం తెలిశాక జాను భావోద్వేగానికి గుర‌య్యే తీరు సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలుస్తుంది. ద్వితీయార్ధంలో మ‌రిన్ని భావోద్వేగాలు పండాయి.

>> రామ్‌, జాను క‌లిసి ఒక రోజు రాత్రి చేసే ప్రయాణం.. అక్కడ జాను గురించి రామ్ తెలుసుకున్న విష‌యాల గురించి చెప్పడం, రామ్ స్టూడెంట్స్ ద‌గ్గర జాను చెప్పిన ప్రేమ‌క‌థ‌, ఆ నేప‌థ్యంలో భావోద్వేగాలు మ‌నసుల్ని హ‌త్తుకుంటాయి. క‌థ‌లోనే బ‌లం ఉండ‌టం వల్ల మాతృక‌తో పోల్చి చూసుకున్నా.. దేని మ్యాజిక్ దానిదే అనే భావ‌న‌కి గురిచేసింది.

>> అక్కడ‌క్కడా స‌న్నివేశాలు నిదానంగా సాగ‌డం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. శ‌ర్వానంద్, స‌మంత పాత్రల‌కి ప్రాణం పోశారు. వాళ్ల ఎంపిక వంద‌శాతం స‌రైన‌ద‌నిపిస్తుందీ చిత్రం.

ఎవ‌రెలా చేశారంటే:
శ‌ర్వా, స‌మంత‌ల న‌ట‌నే చిత్రానికి ప్రధాన బ‌లం. కొన్ని స‌న్నివేశాలు నాలుగు గోడ‌ల మ‌ధ్య‌, రెండే రెండు పాత్రల మ‌ధ్య సాగుతుంటాయి. అలాంటి స‌న్నివేశాల్ని ర‌క్తిక‌ట్టించ‌డం ఆషామాషీ కాదు. కానీ శ‌ర్వా, స‌మంత‌లు త‌మ అనుభ‌వాన్నంతా నూరిపోసి వాటిని పండించారు. చాలా స‌న్నివేశాలు ఇద్దరి మ‌ధ్యే సాగుతుంటాయి. అయినా ఎక్కడా బోర్ కొట్టదు.

>> వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేశ్‌, ర‌ఘుబాబు, శ‌ర‌ణ్య త‌దిత‌రులు క్లాస్‌మేట్స్‌గా చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. ప్రథ‌మార్ధంలో చాలా స‌న్నివేశాల్లో వినోదం పంచారు.

>> చిన్నప్పటి రామ్, జానులుగా క‌నిపించిన సాయికుమార్‌, గౌరిల అభిన‌యం కూడా మెప్పిస్తుంది. అమాయ‌కంగా క‌నిపిస్తూ స‌న్నివేశాల్ని పండించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. గోవింద్ వ‌సంత సంగీతం, మ‌హేంద్రన్ జైరాజ్ కెమెరా ప‌నిత‌నం, మిర్చికిర‌ణ్ మాట‌లు మెప్పిస్తాయి.

>> ప్రేమ్‌కుమార్ భావోద్వేగాల‌పై ప‌ట్టు కోల్పోకుండా క‌థ‌ని న‌డిపించిన విధానం మెప్పిస్తుంది. దిల్‌రాజు చేసిన తొలి రీమేక్ సినిమా ఇది. ఆయ‌న సంస్థ స్థాయికి త‌గ్గట్టుగా నిర్మాణ విలువ‌లు ఉన్నాయి.

బ‌లాలు బ‌లహీన‌త‌లు
+
క‌థ -అక్కడ‌క్కడా నిదానంగా సాగే స‌న్నివేశాలు
+భావోద్వేగాలు
+శ‌ర్వానంద్‌, స‌మంత న‌ట‌న
+సంగీతం
చివ‌రిగా: తొలిప్రేమలోని అనుభూతుల్ని పంచుతూ మ‌న‌సుల్ని హ‌త్తుకునే.. 'జాను'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. రివ్యూ: రొటీన్​ కథలో థ్రిల్లింగ్ అనుభవం​ ​'మలంగ్​'

Intro:Body:

Watch: Janhvi freezes seeing pap almost meeting with accident

Janhvi Kapoor freezed for a moment as she saw a photographer almost meeting with an accident while clicking her pictures.

Mumbai: Janhvi Kapoor, who has always been warm with the ever-following paparazzi, was in a shock for a moment when she saw one of the lensmen had a miraculous escape on Thursday night.

Janhvi was was snapped outside a clinic in city's Juhu area. While she was reaching her car, a photog is seen capturing her and so engrossed in his job that he even did not notice an auto rushing towards him. It was Janhvi's bodyguard who helped the wobbly  lensman to regain his balance.

While all this happened in friction of seconds, Janhvi apparently could not understand how to react and covered her mouth in shock. However, she later asked the photog if he is alright and unhurt.

This is not the first time that Janhvi expressed concern for paparazzi who are chasing celebrities from city's one end to the other. In past, she saved a pap from falling while coming out of an eatery with half-sister Anshula Kapoor. 

On the work front, Janhvi will be next seen in Gunjan Saxena's biopic The Kargil Girl. In the film, Janhvi wiil be seen playing Indian Air Force combat pilot Gunjan Saxena, who entered the war zone during the 1999 Kargil War. Directed by Sharan Sharma, it will hit the screens on March 13.

The actor, who was last seen in Ghost Stories also has Karan Johar's ambitious period drama Takht in her kitty.

Conclusion:
Last Updated : Feb 29, 2020, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.