ETV Bharat / sitara

రివ్యూ: 'భానుమతి & రామకృష్ణ' మెప్పించారా? - ఆహా భానుమతి రామకృష్ణ సినిమా

విభిన్న ప్రేమకథతో తెరకెక్కిన 'భానుమతి & రామకృష్ణ' సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎలా ఉంది? నటీనటులు ఏ మేరకు మెప్పించారు?

రివ్యూ: 30 ఏళ్లు దాటిన ఈ ప్రేమకథ అలరించిందా?
'భానుమతి & రామకృష్ణ'
author img

By

Published : Jul 3, 2020, 3:10 PM IST

చిత్రం: భానుమతి & రామకృష్ణ

నటీనటులు: నవీన్‌ చంద్ర, సలోని లుత్రా, రాజా చెంబోలు, వైవా హర్ష తదితరులు

సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌, అచ్చు రాజమణి (నేపథ్య సంగీతం)

నిర్మాత: యశ్వంత్‌ ములుకుట్ల

రచన, దర్శకత్వం: శ్రీకాంత్‌ నాగోతి

విడుదల: 03/07/2020 (ఆహా ఓటీటీ)

తెలుగు సినిమాల్లో ప్రేమ కథ అంటే... అయితే కాలేజీ బేస్డ్‌ లేదంటే అప్పుడే ఆఫీసులో జాయిన్‌ అయిన యువత నేపథ్యంలో ఉంటుంది. అంతగా ప్రేక్షకులకు అలవాటు చేసేశారు మన దర్శక-నిర్మాతలు. మరి ప్రేమ ఆ వయసు వాళ్లకేనా... కాదు అని చెప్పడానికి అప్పుడప్పుడు కొన్ని సినిమాలొస్తుంటాయి. అలా వచ్చిందే 'భానుమతి & రామకృష్ణ'. ఓటీటీ అంటే క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అనుకుంటున్న నేటి కాలంలో ‘భానుమతి & రామకృష్ణ’ లాంటి ఓ లవ్‌ స్టోరీ ... 'ఆహా ఓటీటీ' యాప్‌లో వచ్చింది. నిజానికి పెద్ద తెరపైనే విడుదలవ్వాల్సి ఉన్నా... కరోనా కారణంగా చిన్న తెరకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? భానుమతి... రామకృష్ణ వీక్షకులను ఎంతమేర ఆకట్టుకున్నారో చూద్దాం!

BHANUMATHI RAMAKRISHNA REVIEW
'భానుమతి & రామకృష్ణ' సినిమా

కథేంటంటే:

30 దాటిన వాళ్లలో ప్రేమ ఉండదా? జీవితంలో ఎంతో కొంత సాధించి, ఇంకా ఎంతో సాధించాలనుకుంటున్న 30 ప్లస్‌ బ్యాచ్‌ ప్రేమ ఎలా ఉంటుంది? 'భానుమతి & రామకృష్ణ' సినిమా ట్రైలర్‌ చూస్తే... ఇది అచ్చంగా అలాంటి సినిమానే అనిపిస్తుంది. సినిమా కథేంటో మూడు నిమిషాల ట్రైలర్‌లో చూపించేసినా... వాళ్ల ప్రేమ ప్రయాణం ఎలా సాగిందనే ఆసక్తి పెంచారు. 33 ఏళ్ల రామకృష్ణ (నవీన్‌ చంద్ర), 30 ఏళ్ల భానుమతి (సలోని) మధ్య పుట్టిన ప్రేమ ఎలా సాగింది... ఎలా పెళ్లి వరకు వెళ్లింది.. మధ్యలో ఏమైంది అనేది సినిమాలో చూపించారు. నిజానికి ఇది చాలా చిన్న పాయింటే అయినప్పటికీ '30 ఏళ్ల తర్వాతే పెళ్లి' అని అనధికారికంగా ఫిక్స్‌ అయిపోయిన నేటి యువతకు బాగా కనెక్ట్‌ అయ్యే పాయింట్‌. ప్రేమించానంటూ వెంటపడే వయసూ కాదు.. ప్రేమించకపోతే చచ్చిపోతా అని బెదిరించే స్థాయీ కాని యువతీయువకుల ప్రేమకథ ఇది. అలాంటి పరిణతి చెందిన ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో సినిమాలో చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

కూతురుని కొడుకులా పెంచిన కుటుంబం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన డబుల్‌ డోస్‌ ఆత్మాభిమానం ఉన్న ఓ అమ్మాయి. పుట్టి బుద్ధెరిగి సొంతూరు నుంచి కాలు బయటపెట్టని ఓ కుర్రాడు. ఈ కాంబినేషనే బాగుంది కదా. అలాంటిది ఆ ఇద్దరూ ఓ ఎమ్‌ఎన్‌సీలో కలసి పని చేయాల్సి వస్తే... పని చేసీ చేసీ ప్రేమలో పడిపోతే. నేరుగా ప్రేమ గురించి వాళ్ల ఆలోచన విధానం చూస్తే... చెప్పడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చే అమ్మాయి... మొహమాటం అడ్డొచ్చే అబ్బాయి. మనసులోని భావాలను నేరుగా చెప్పలేక.. చేతల్లో చూపించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుంది. ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్న జంట... దగ్గరగా నిల్చోవడానికి కూడా మొహమాటపడే మరో జంట ఒకే ఫ్రేమ్‌లో చూపించాడు దర్శకుడు. అక్కడే నేటి తరం యువతకు, ఇప్పుడు 30వ పడిలో పడిన జంటకు ఉన్న తేడా చూపించాడు దర్శకుడు. అలాంటి సన్నివేశాల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకునే అవకాశాలూ ఉన్నాయి. 'వెంటపడే ప్రేమ', 'వేధించే ప్రేమ' రాజ్యమేలుతున్న నేటి సినిమాల్లో... ఈ బాధ్యత ఉన్న ప్రేమ చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. హీరో ఎంట్రన్స్‌లోనే క్లైమాక్స్‌ ఊహించేసినా... ఆ ఆఖరి ఫ్రేమ్‌కి దర్శకుడు సినిమాను తీసుకెళ్లిన విధానం చక్కగా ఉంది. థియేటర్లలో విడుదలైతే ఇది మల్టీప్లెక్స్‌ సినిమా అనేవారు. ఓటీటీ కాబట్టి కొంతమందికే పరిమితమయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య ప్రేమ కామన్‌ అందరికీ అర్థమైనా.. ఎంఎన్‌సీ ఉద్యోగుల లాంగ్వేజ్‌ మామూలు వీక్షకుడికి పంటి కింద రాయిలా అనిపిస్తుంది. కథానాయిక ఆలోచనల్లోని మార్పులను సినిమాలో బాగా చూపించారు. ద్వేషం, కోపం, ఎంత బాగా తెరపై కనిపించిందో.. ఆ ద్వేషం ఇష్టంగా మారడం, ఆ కోపం ప్రేమగా మారడాన్ని దర్శకుడు చక్కగా రాసుకున్నాడు. అదే హీరో విషయానికి వచ్చేసరికి, అమాయకత్వం చురుకుతనంగా మారడం, ఇష్టం ప్రేమగా మారడం లాంటివి చూపించలేదు. కేవలం రెండు డైలాగులతో హీరోలో మార్పు ఎలా వచ్చిందో చెప్పేశారు. దీంతో ఎక్కడో చిన్న ఎమోషనల్‌ కనెక్టివిటీ పోయినట్లనిపిస్తుంది.

BHANUMATHI RAMAKRISHNA REVIEW
'భానుమతి & రామకృష్ణ' సినిమా

ఎవరెలా చేశారంటే:

సినిమాలో పాత్రల గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది... సినిమాలో కీలకంగా ఉండేది రెండు పాత్రలే. ఒకటి హీరో నవీన్‌చంద్ర, రెండోది హీరోయిన్‌ సలోని. నవీన్‌ చంద్ర అంటే... అయితే గెడ్డం పెంచుకొని విషాద ప్రేమికుడు, లేదంటే ఆవేశంతో గొంతు చించుకునే ప్రేమికుడూ కనిపించేవాడు. కానీ ఈ సినిమాలో కొత్తగా ట్రై చేశాడు. లుక్‌ నుంచి యాటిట్యూడ్‌ వరకు అన్నింటా మార్పు చూపించాడు. ఒత్తుగా జుట్టు పెంచి.. పక్క పాపిడి దువ్వి.. నుదట బొట్టు పెట్టి కొత్తగా కనిపించాడు. అంతేకాకుండా పర్‌ఫెర్మాన్స్‌ కూడా సెటిల్డ్‌గా అనిపించింది. చాలా వరకు తెర (సినిమా తెర కాదనుకోండి) మీద నవీన్‌చంద్ర కాకుండా రామకృష్ణనే కనిపించాడు. కొత్తగా ఆఫీసులో చేరిన సందర్భంలోనూ, భానుమతితో గొడవపడి ఇంటికెళ్లి తల్లి దగ్గర ఏడ్చిన సన్నివేశంలో నవీన్‌చంద్ర ఆకట్టుకుంటాడు. కథానాయిక సలోని గురించి చూస్తే... తెలుగులో తొలి సినిమా అయినా... స్టేజీ ఆర్టిస్ట్‌గాను, ఇతర పరిశ్రమలోనూ చేసిన అనుభవంతో మెప్పించింది. మనసులో బాధ ఉన్నా.. బెట్టు ప్రదర్శించడం, మానసిక ఒత్తిడిని భరించడం, ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే తట్టుకోలేకపోవడం, ప్రేమ ఉన్నా బయట పెట్టడానికి అహం అడ్డు రావడంలాంటి సన్నివేశాల్లో చాలా పరిణతితో నటించింది. పతాక సన్నివేశాల్లో రామకృష్ణ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె నటనకు చప్పట్లు తప్పనిసరి. అన్నట్లు ఓటీటీ సినిమా కదా ఇంట్లోనో, జర్నీలో చూస్తారు కాబట్టి... మనసులో కొట్టేయొచ్చు చప్పట్లు. ఇక మిగిలిన పాత్రల్లో వైవా హర్ష ఒక్కటే కాస్త ఎక్కువ సేపు కనిపిస్తాడు. తనదైన ‘ఫ్రస్టేషన్‌’ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు. మిగిలినవన్నీ అలా వచ్చి ఇలా వెళ్లేవే.

సాంకేతికత బృందం గురించి చూస్తే... ఫీల్‌గుడ్‌ సినిమాకు ప్రాణం సంగీతం, విజువల్స్‌. ఈ విషయంలో చిత్రబృందం హిట్‌ కొట్టింది. డ్యూయట్స్‌ లేకపోయినా... మాంటేజ్‌ సాంగ్స్‌లో శ్రవణ్‌ భరద్వాజ్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. అచ్చు రాజమణి నేపథ్య సంగీతమూ బాగుంది. సినిమాలో అయితే ఆఫీసు లేదంటే ఇల్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ రెండింటినీ డీవోపీ సాయిప్రకాశ్‌ ఉమ్మడిసింగు చాలా యూత్‌ఫుల్‌గా చూపించారు. మాంటేజ్‌ పాటల్లో హైదరాబాద్‌ అందాలను చక్కగా చూపించారు. నిర్మాణ విలువలూ బాగున్నాయి. కృష్ణ కాంత్‌ పాటలు బాగున్నాయి. రవికాంత్‌ పేరేపు సినిమాకు బాగానే కత్తిరేశాడు. ఇక దర్శకుడి గురించి చెప్పుకుంటే అప్పుడెప్పుడో వచ్చిన ‘ఆర్య’ గుర్తొచ్చింది. సినిమా టైటిల్‌ కార్డ్స్‌లోనే మెయిన్‌ క్యారెక్టర్‌ భానుమతి ఆలోచన విధానం ఎలాంటిదో చెప్పేశారు. అలాగే తొలి హీరో రామకృష్ణ కనిపించిన తొలి సన్నివేశాల్లోనే ఎలాంటోడో చెప్పేశాడు. అంత పక్కాగా సినిమాను తీసుకెళ్లాడు. ఎలాంటి డ్యూయెట్స్‌ లేకుండా, ఎక్కడా బోర్‌ కొట్టకుండా పకడ్బంధీగా సినిమా రాసుకున్నాడు. అంతే గంటన్నర ఎప్పుడైందో తెలియకుండా సినిమా సాగుతుంది.

బలాలు

  • హీరో, హీరోయిన్‌ పాత్రల ఎంపిక
  • సగటు యువత జీవితం
  • సినిమా నిడివి

బలహీనతలు

  • అందరికీ కనెక్ట్‌ అయ్యే ప్లాట్‌ కాకపోవడం
  • వినోదం
  • ప్రీక్లైమాక్స్‌లో ఎమోషనల్‌ కనెక్టివిటీ తెగిపోవటం

చివరిగా: పరిణతి చెందిన 'ప్రేమకథ'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.