ETV Bharat / sitara

MAA ELECTIONS 2021: మా ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఇదే.. - మా ఎన్నికల న్యూస్​

అక్టోబర్​ 10వ తేదీన జరగనున్న మా ఎన్నికలకు (MAA ELECTIONS 2021) పోటీపడే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు బరిలో నిలవగా.. అత్యంక కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టుకు పోస్టుకు జీవిత రాజశేఖర్, రఘుబాబులు తలపడనున్నారు.

maa elections 2021 candidates final list
మా ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారు
author img

By

Published : Oct 2, 2021, 8:58 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో (MAA ELECTIONS 2021) పోటీపడే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఈ మేరకు పోటీలో ఉన్న వారి జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు. 2021-23 కార్యవర్గానికి సంబంధించి మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా.... 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతుండగా... స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీవీఎల్ నర్సింహారావు, కె.శ్రావణ్ కుమార్ చివరి నిమిషంలో తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య అధ్యక్ష పోటీ ఖరారైంది.

మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్​లో ఉండే రెండు వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు మంచు విష్ణు ప్యానెల్ నుంచి పృథ్వీరాజ్, మాదాల రవి పోటీలో ఉండగా... ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జి, హేమ పోటీలో ఉన్నారు. అత్యంక కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవిత రాజశేఖర్, రఘుబాబు, బండ్ల గణేశ్ నామినేషన్ దాఖలు చేయగా... పెద్దల సూచలతో బండ్ల గణేశ్ తప్పుకున్నారు. దీంతో ఆ పోస్టుకు జీవితరాజశేఖర్, రఘుబాబులు బరిలో నిలిచారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా... రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. మిగతా 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో తుది జాబితాను వెల్లడించిన కృష్ణమోహన్.. అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఫిల్మ్​నగర్​లోని జూబ్లీ పబ్లిక్ పాఠశాలలో జరిగే మా ఎన్నికలకు ఈవీఎంల ద్వారా పోలింగ్ జరపనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు.

ఇదీ చూడండి: సమంత గురించి నాగార్జున ఎమోషనల్ పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.