ETV Bharat / sitara

'సంజయ్​... ఇలాంటప్పుడే ఫైటర్​లా పోరాడాలి​' - సంజయ్‌దత్‌ క్యాన్సర్​

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యింది. ఇటీవలే ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్​కు ధైర్యం చెప్తూ.. ప్రముఖ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ ట్వీట్​ చేశారు.

yuvraj tweet to sanjay dutt
'సంజయ్​... ఇలాంటప్పుడే ఫైటర్​లా పోరాడాలి​'
author img

By

Published : Aug 12, 2020, 3:33 PM IST

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధరణ అయ్యింది. శ్వాసకోస సంబంధ సమస్యలతో ఇటీవల ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన.. సోమవారం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ట్విట్టర్​ ద్వారా స్పందించారు.

"సంజయ్‌ దత్‌.. ఈ సమయంలో మీరు ఫైటర్‌లా పోరాడాలి. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు మీరు మరింత దృఢంగా ఉండాలి. మీరు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను"

-- యువరాజ్​ సింగ్​, భారత మాజీ క్రికెటర్​

గతంలో యువరాజ్‌ సింగ్‌ ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ బారినపడ్డారు. అయితే మెరుగైన చికిత్స తీసుకొని దాన్నుంచి కోలుకున్నారు.

మరోవైపు వైద్యం నిమిత్తం కొంచెం విరామం తీసుకుంటున్నట్లు సంజయ్‌ ప్రకటించారు.

"వైద్యం నిమిత్తం నా పని నుంచి కొంచెం విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబం, స్నేహితులు నాతోనే ఉన్నారు. నా ఆరోగ్యం పట్ల వదంతులు సృష్టించొద్దని కోరుతున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తా" అని ట్విట్టర్​లో సంజయ్​ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయన 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2', 'శమ్‌షేరా' చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన 'సడక్‌ 2', 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' సినిమాలు ఓటీటీ వేదికగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.