ETV Bharat / sitara

కథ నచ్చితే కర్చీఫ్ వేస్తున్న కుర్ర హీరోలు! - sharwanand movie updates

కొంతకాలంగా టాలీవుడ్​లో కథలకు కొరత లేకుండా పోతోంది. ముఖ్యంగా యువ కథానాయకుల కోసమే ఎక్కువగా స్టోరీలు తయారవుతున్నాయి. ఈ క్రమంలోనే చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా.. సరికొత్త కథ దగ్గరికొస్తే కర్చీఫ్​ వేసేస్తున్నారు కుర్రహీరోలు. వరుసగా ప్రాజెక్టులకు సంతకాలు చేస్తూ.. మరో రెండు మూడేళ్ల వరకు ఖాళీ లేకుండా చూసుకుంటున్నారు.

cinema
యంగ్​ హీరోలు
author img

By

Published : Oct 3, 2020, 7:35 AM IST

ఒకప్పటిలా హీరోలు కథల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లుగా వర్తమాన రచయితలు, దర్శకులు పోటాపోటీగా కథలు సిద్ధం చేస్తున్నారు. అందుకే విరామం లేకుండా ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో దానికి కొబ్బరికాయ కొట్టేస్తుంటారు హీరోలు. కరోనా విరామం వల్ల కొత్త కథల ఉద్ధృతి మరింత పెరిగింది. అందుకే కథానాయకులకు ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా, చేయడానికి మరో కథ మిగిలే ఉంటోంది.

అగ్ర కథానాయకుల మాటేమో కానీ, యువ హీరోల కోసం కథలు విరివిగా సిద్ధమవుతున్నాయి. అవి నచ్చే వాళ్లు ఒకొక్కరు నాలుగైదు సినిమాలు ఒప్పేసుకున్నారు. రెండు మూడేళ్ల వరకు కథల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ముందు చూపుతో కథ నచ్చిందంటే చాలు కర్చీఫ్‌ వేసేస్తున్నారు. ఆయా దర్శకులతో తుది మెరుగులు దిద్దిస్తూ వాటిని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

cinema
నాగ చైతన్య

'లవ్‌స్టోరీ' చిత్రీకరణ పూర్తి చేసిన నాగచైతన్య కొత్త కథకుల్ని ఆకర్షించడంలో ముందున్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా చేయబోతున్న నాగచైతన్య కోసం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి కథ సిద్ధం చేశారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఆట నేపథ్యంలో నాగచైతన్య కోసం కథ తయారు చేస్తున్నట్లు సమాచారం. అభిలాష్‌ అనే ఓ కొత్త దర్శకుడు నాగచైతన్యకి స్టోరీ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది.

cinema
నాని

నాని 'టక్‌ జగదీష్‌'ని పూర్తి చేయడం కోసం త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారు. ఆ చిత్రం తర్వాత ఆయన చేయాల్సినవి చాలానే ఉన్నాయి. 'శ్యామ్‌ సింగరాయ్‌'తో పాటు శ్రీకాంత్‌ అనే కొత్త దర్శకుడితోనూ ఓ సినిమా ఒప్పుకున్నారు. వివేక్‌ ఆత్రేయ నాని కోసం కథ సిద్ధం చేశారు. వీళ్లతోపాటు, 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో విజయాన్ని అందుకున్న స్వరూప్‌.ఆర్‌.ఎస్‌.జె దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్టు చేయనున్నారని సమాచారం.

cinema
శర్వానంద్​

మరో యువ కథానాయకుడు శర్వానంద్‌ జోరుమీదున్నారు. ప్రస్తుతం 'శ్రీకారం'తో పాటు, ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక 'మహాసముద్రం' కోసం రంగంలోకి దిగనున్నారు. ఆ తర్వాత దిల్‌రాజు నిర్మాణ సంస్థలో ఓ కథ ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. థ్రిల్లర్‌ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఓ దర్శకుడు శర్వానంద్‌ కోసం కథ సిద్ధం చేయగా.. అది దిల్‌రాజు విని ఓకే అన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.