ETV Bharat / sitara

పవన్ 'వకీల్​సాబ్'​లో మరో స్టార్ హీరోయిన్​?

author img

By

Published : Mar 11, 2020, 2:08 PM IST

పవర్​ స్టార్ 'వకీల్​సాబ్'లోని ఓ కీలక పాత్ర కోసం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో ముఖ్యంగా శ్రుతిహాసన్, ఇలియానా ఉన్నారట.

YET ANOTHER STAR HERONE'S NAME IS DISCUSSION FOR VAKEEL SAAB?
పవన్ 'వకీల్​సాబ్'​లో మరో స్టార్ హీరోయిన్​?

పవర్​ స్టార్​ పవన్​కల్యాణ్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్​సాబ్'తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందులో లాయర్​గా నటిస్తున్నాడు. షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. ఒక్క ఫ్లాష్​బ్యాక్​ ఎపిసోడ్ మినహా మిగతా చిత్రీకరణ అంతా పూర్తయినట్లు సమాచారం. పవన్​ సరసన ఏ హీరోయిన్​ నటిస్తుందనేది ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

తొలుత ఈ పాత్రలో శ్రుతిహాసన్ నటిస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో ఇలియానా పేరు వినిపిస్తోంది.​ వీరిద్దరిలో ఎవరు నటిస్తారనేది ఈ వారంలోపు తేలనుంది. గతంలో పవన్​​ సరసన 'గబ్బర్​సింగ్​', 'కాటమరాయుడు' చిత్రాల్లో శ్రుతిహాసన్​.. 'జల్సా'లో ఇలియానా నటించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా 'మగువా మగువా' అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం. తమన్ సంగీతమందించాడు. వేణు శ్రీరామ్ దర్శకుడు. బోనీకపూర్ సమర్పణలో దిల్​రాజు.. బేవ్యూ ప్రాజెక్ట్స్​తో కలిసి నిర్మిస్తున్నారు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.