జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ వంటి దిగ్గజ నటులను విలన్ పాత్రల్లో చూపిన 'ధూమ్' సిరీస్ ఇప్పుడు కొత్త సీక్వెల్‌తో మరో ప్రయోగం చేయబోతోంది. ఈ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో చిత్రం(Dhoom 4)లో పాన్ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఎంపిక చేసినట్లు ఇటీవలే ప్రచారం జరిగింది. కానీ, ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ చిత్రానికి ప్రభాస్‌ను ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని యశ్‌రాజ్ ఫిలింస్(Yash Raj Films) విరమించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'రాధేశ్యామ్'(Radhe Shyam), 'ఆదిపురుష్'(Adipurush) చిత్రీకరణ జరుగుతుండగా.. నాగ్అశ్విన్ రూపొందించనున్న చిత్రం ప్రీ-ప్రొడక్షన్ జరుపుకొంటోంది. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటించనుండగా.. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషించనున్నారు.
ఇదీ చూడండి: Janhvi: బీచ్‌లో జాన్వీ కపూర్‌తో ఉన్నదెవరు?