టాలీవుడ్‌లో వచ్చిన సోషియో ఫాంటసీ హిట్ చిత్రాల్లో 'యమదొంగ' ముందువరసలో ఉంటుంది. గ్రాఫిక్స్‌తో అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో 2007లోనే నిరూపించాడు ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. హీరోగా నటించిన జూ.ఎన్టీఆర్.. రెండు పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. యమధర్మరాజుగా డైలాగ్ కింగ్ మోహన్‌బాబు అద్భుతంగా నటించాడు. ఈ ఆగస్టు 15కు సరిగ్గా పుష్కరం పూర్తి చేసుకుందీ సినిమా. ఆ సందర్భంగా దీనికి సంబంధించిన విశేషాలు ఓసారి చూద్దాం.
యమలోకం నేపథ్యంలో మోహన్ బాబు, జూ.ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ఇందులో ప్రేక్షకులు మెచ్చిన మరో ప్రధాన అంశం సంగీతం. కీరవాణి అందించిన పాటలు, నేపథ్య సంగీతం శ్రోతలను విపరీతంగా అలరించాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల పాత్రల కలయికలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హృదయాన్ని హత్తుకుంటుంది. కీరవాణి సంగీతానికి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేశాయి.
దీనికి తోడు విజయేంద్ర ప్రసాద్ కథ, ఎం.రత్నం సంభాషణలు, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్.. ఈ సినిమాను అభిమానుల మదిలో స్థానం సంపాదించిపెట్టాయి.
‘ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా.. ఎంత మాట ఎంతమాట’ అంటూ హీరో జూ.ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ను ఇప్పటికీ అభిమానించే వారు కోకొల్లలు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
‘యమదొంగ’ ప్రత్యేకతలు:
- అప్పటివరకు లావుగా కనిపించిన ఎన్టీఆర్.. ఈ సినిమా కోసం ఊహించని రీతిలో సన్నబడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
- ఓ పాటలో సీనియర్ ఎన్టీఆర్(గ్రాఫిక్స్) జూనియర్ ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం.
- ప్రత్యేక గీతంలో తళుక్కుమన్న ప్రముఖ నటి రంభ
- ఉత్తమ కథానాయకుడిగా జూ.ఎన్టీఆర్‌కు అవార్డు
ప్రస్తుతం ఇదే దర్శకుడితో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఇందులో కొమరం భీమ్ పాత్రలో అలరించనున్నాడు. రామ్‌చరణ్ మరో కథానాయకుడిగా నటిస్తూ అల్లూరి సీతరామరాజు పాత్రలో కనువిందు చేయనున్నాడు.
ఇది చదవండి: జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం: తెలుగు తెరపై మరో 'తారకరాముడు'