- సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చేతుల మీదుగా గురువారం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో అదిత్, శివాత్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కేవీ గుహన్ దర్శకుడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- విలక్షణ నటుడు ఉపేంద్ర ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'కబ్జా'. ఇందులోని ఓ కీలకపాత్ర కోసం కిచ్చా సుదీప్‌ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. 1947 నుంచి 1986 మధ్య మాఫియాను రూపుమాపడానికి ప్రయత్నించిన భార్గవ్ భక్షీ పాత్రలో ఆయన నటించనున్నట్లు వెల్లడించింది.
- విక్టరీ వెంకటేశ్, ప్రియమణి ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నారప్ప'. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది.
- నాగశౌర్య, షెర్లీ సెటియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం 'లక్ష్య'. ఇందులో శౌర్య.. ఆర్చరీ క్రీడాకారుడిగా ఎనిమిది పలకల దేహంతో కనిపించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇదీ చూడండి: రజనీ అభిమానులకు లారెన్స్ క్షమాపణలు