ETV Bharat / sitara

మహిళల సమస్యలపై సినిమాల్లో పేలిన డైలాగ్స్​ ఇవే! - మహిళా సమస్యలపై డైలాగ్​లు

Women issue songs dialogues: మా ఇష్టానికి ఎందుకు ప్రాధాన్యం ఉండదు? మమల్ని ఎందుకు బంధీలుగా ఉంచుతారు? పెళ్లి అయితే అత్తారింటికి మేమే ఎందుకు వెళ్లాలి? పుట్టింటికి రావాలంటే ఎందుకన్ని పర్మీషన్స్ కావాలి​? ఇప్పటికీ అబ్బాయి పుడితే సంతోషపడి, అమ్మాయి పుడితే ఎందుకు చిన్నచూపు చూస్తారు? ఇలా ఎన్నో ఆలోచనలు చాలా మంది అమ్మాయిల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. నిజజీవితంలో వారు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. వీటిన అర్థం చేసుకున్న వారు కొంతమంది రచయితలు, దర్శకులు సినిమాల్లో డైలాగ్​లు, పాటలు ద్వారా ఆ సమస్యలను చూపించారు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం...

Women issue songs dialogues
Women issue songs dialogues
author img

By

Published : Mar 8, 2022, 1:28 PM IST

Women issue songs dialogues: సమాజం, ప్రపంచం అభివృద్ధి చెందుతున్నా ఇంకా.. 'వాళ్లతో మాట్లాడొద్దు.. వీళ్లతో మాట్లాడొద్దు.. ఆ పని చేయొద్దు.. ఈ పని చేయొద్దు.. అక్కడికి వెళ్లొద్దు.. ఇక్కడికి వెళ్లొద్దు..' అంటూ ఇలా ఎన్నో తరాలుగా ఎన్నో కట్టుబాట్లు, ఆచారాలు ఆడపిల్లల అభివృద్ధికి అడ్డంకిగా మారుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి పలువురు మహిళలు ఎదుగుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఇంకా చాలా మంది అతివలు ఈ కట్టుబాట్లకు బలవుతూనే ఉన్నారు. అయితే వాటిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు.. ఈ సమస్యలను ప్రతిబింబించేలా ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రజలను ఆలోచింపజేసేలా వాటిపై డైలాగ్, పాటలు కూడా ఉంటున్నాయి. వీటి ద్వారా మగువల కీర్తి, ఖ్యాతి, గొప్పతనం, వాళ్లలో ఉండే ప్రత్యేకత, వాళ్లు ఎదుర్కొనే సమస్యలు, వాళ్లు పడే బాధను వివరించారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో మహిళల అభివృద్ధికి అడ్డంకిగా మారిన కట్టుబాట్లను, వారు ఎదుర్కొనే సమస్యలను తెలిపేలా ఉన్న కొన్ని డైలాగ్స్​, సాంగ్స్​ను చూసేద్దాం..

"ఒక చోట పుడతాం, పెరుగుతాం, పెళ్లి చేసుకుంటాం, ఎక్కడికో వెళ్లిపోతాం.. అంతే కదా నువ్వైనా నేనైనా.. అమ్మాయిలు ఎందుకు వెళ్లాలి నాన్న అన్నీ వదులుకొని?.. ఈ రూల్​ ఎవడు పెట్టిండో కానీ చాలా మోసం నాన్న"

-ఫిదా, సాయి పల్లవి

"కాలేజీకి వెళ్లు, వెళ్లావా పాస్​ అవ్వు, అయ్యావా పెళ్లి చేసుకో, చేసుకున్నావా, పిల్లల్ని కను.. ఇదేనా లైఫ్​ అంటే?... ఇంట్లో బంగారం లాంటి అమ్మాయిని పెట్టుకుని కొడుకు ఉంటే బాగుండేది అనుకోవడం ఏంటి?"

-పెళ్లి చూపులు, విజయ్​ దేవరకొండ

"క్రికెట్ ఆడాలంటే సెక్సువల్​ ఫేవర్​ అడుగుతున్నాడు, నాన్న ఏమో పరువు అంటారు, నువ్వేమో ఫైట్​ చేయమంటావ్​.. నాకేం కావాలో ఎవరైనా అడిగారా"

-డియర్​ కామ్రేడ్, రష్మిక​

"నా ఫిగర్​ 36-24-36 కాదు.. అమ్మాయి లావుగా ఉంటే రిజెక్ట్​ చేస్తారా? పెళ్లి అయ్యాక లావు అయితే డివర్స్​ ఇస్తారా?"

-సైజ్​ జీరో, అనుష్క

"అమ్మ, నాన్నకి సినిమాలో యాక్టింగ్​ ఇష్టం లేదు. సినిమాలే డర్టీనా?.. మొత్తం ప్రపంచం క్లీనా?"

-సమ్మోహనం, అదితీ రావు హైదరీ

"మగవాళ్లు అనుకో లవ్​ ఫెయిల్యూర్​ అయి, బయటకు వచ్చి పెళ్లి చేసుకునేదాకా మందు కొట్టి కథలు చెప్తారు, ఫ్రెండ్స్​ వచ్చి ఓదారుస్తారు.. మనకి అలా కాదు కదా? లవ్​ ఫెయిల్యూర్​ అని రియలైజ్​​ అయ్యేలోపే పెళ్లి పీటల మీద ఉంటాం"

-కలర్​ ఫొటో

"చంటి పిల్లాడితో రోడ్డు మీద నిలబడితే ఆదరించడానికి ఎవరు రాలేదు సరి కదా.. ఒంటరి దాన్ని కదా అని అలుసుగా చూసేవారు.. నాకు వయసు ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు.. నా జీవితం నాకు కావాలి"

-ఓ బేబీ, లక్ష్మి

"అయినా పెళ్లి కావాల్సిన దానివి, ఇంకా ఆఫీస్​ చాలులే అమ్మ.. ఆడపిల్లలకి బైక్​ ఎందుకు అమ్మా, పొరపాటున కింద పడితే.. అసలే పెళ్లి కావాల్సిన దానివి"

-మహానటి

"పెళ్లి అయ్యాక పుట్టింటికి వెళ్లాలి అంటే ఎన్నో పర్మిషన్​లు.. నా వాళ్లని చూడటానికి నాకు ఇన్ని ఆంక్షలా? అనిపిస్తుంది.. మా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు, మర్చిపోయేంత చిన్నవి కావు"

-నువ్వు నాకు నచ్చావ్, సుహాసిని​

"ఓ అమ్మాయి జీన్స్​ వేసుకోకూడదు, స్కర్ట్​ వేసుకోకూడదు.. వాళ్లకి నచ్చిన బట్టలు అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకి ప్రమాదకరం కాదు. అబ్బాయిలకు ప్రమాదం. పాపం ఎందుకంటే.. అబ్బాయిలు టెంప్ట్ ​ అయిపోతారు. అందుకే ఇలాంటి అమాయకులైన అబ్బాయిలని మనం కాపాడుకుందాం.!"

-వకీల్​సాబ్​లో పవన్​ సెటైరికల్ డైలాగ్​​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Greatness of women songs: మహిళ కీర్తి, ఖ్యాతిని రచయితలు కొన్ని పాటల ద్వారా వివరించారు. అవి ప్రేక్షకుల హృదయాలను తాకాయి. అవేంటంటే..

పవన్​కల్యాణ్​ 'వకీల్​ సాబ్​'.. మగువా మగువా సాంగ్​

ధనుష్​ 'రఘువరన్​ బీటెక్'.. ​ అమ్మ అమ్మ సాంగ్​..

మహేశ్​బాబు 'నాని'.. పెదవే పలికిన మాటల్లోనే

అజిత్​' విశ్వాసం'.. చిన్నారి తల్లి

సౌందర్య వెంకటేశ్ 'పవిత్రబంధం'.. ​ అపురూపమైనదమ్మ ఆడజన్మ

రజనీకాంత్​ 'దళపతి'.. ఆడజన్మకు ఎన్నో శోకాలు

'మెరుపుకలలు'.. ఓ వాన పడితే

ఇదీ చూడండి: గుండెజారి గల్లంతయ్యిందే.. నీ సొగసే చూసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.