సూపర్‌స్టార్ రజనీకాంత్, లత పెళ్లిరోజు నేడు. వీరిద్దరి వైవాహిక జీవితానికి ఈ రోజుతో 39 ఏళ్లు నిండాయి. అయితే ఈ జంట ప్రేమించి పెళ్లిచేసుకున్నారన్న విషయం కొంతమందికే తెలుసు. తాజాగా వారి ప్రేమను గుర్తు చేసుకుంటూ అలనాటి ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది తలైవా కూతురు సౌందర్య. ఆమెతో పాటు అభిమానులు పెద్ద ఎత్తును శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
-
LOVE LOVE LOVE you endlessly amma & Appa ❤️❤️❤️ happy anniversary 🤗🤗🤗😘😘😘 pic.twitter.com/tqwwxDtjjw
— soundarya rajnikanth (@soundaryaarajni) February 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">LOVE LOVE LOVE you endlessly amma & Appa ❤️❤️❤️ happy anniversary 🤗🤗🤗😘😘😘 pic.twitter.com/tqwwxDtjjw
— soundarya rajnikanth (@soundaryaarajni) February 26, 2020LOVE LOVE LOVE you endlessly amma & Appa ❤️❤️❤️ happy anniversary 🤗🤗🤗😘😘😘 pic.twitter.com/tqwwxDtjjw
— soundarya rajnikanth (@soundaryaarajni) February 26, 2020
హీరో రజనీ-రిపోర్టర్ లత...
1980లో తలైవా స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలో లత అతడిని కలిశారు. అప్పుడు రజనీ 'గోల్మాల్'కు రీమేక్‌గా తీస్తున్న 'తిల్లు ముల్లు' సినిమా షూటింగ్లో ఉన్నాడు. పాత్రికేయురాలైన లత.. రజనీని ఇంటర్వ్యూ చేయడానికి సెట్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా తలైవా తన అభిరుచులు, అభిప్రాయాలను ఆమెతో పంచుకున్నాడు. అనుకోకుండా ఇద్దరి ఆలోచనలు, ఇష్టాలు కలిశాయట. జీవిత భాగస్వామి దొరికారనుకుని, ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ శుభవార్తను రజనీ ఆ తర్వాత సెట్లోని తన సహనటులతో పంచుకున్నారు.
లతను ఇష్టపడ్డ తర్వాత రజనీ స్వయంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడారట. వారు సమ్మతించడం వల్ల తిరుపతిలో ఇద్దరి పెళ్లి జరిగింది. రజనీ స్నేహితుడు వై.జి. మహేంద్రన్.. లత సోదరిని అప్పటికే వివాహం చేసుకొని ఉండటం వల్ల తలైవాకు అత్తమామల్ని ఒప్పించడం సులభమైంది. రజనీకాంత్-లత దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్దకూతురు పేరు ఐశ్వర్య. తమిళ నటుడు ధనుష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. రజనీ చిన్న కూతురు సౌందర్య.. ఓ ఫార్మా కంపెనీ యజమాని విషగన్ వనగమూడిని ఇటీవలె రెండో పెళ్లి చేసుకుంది.
దర్బార్ తర్వాత ఇదే...
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'దర్బార్' తర్వాత 168వ సినిమాకు సంతకం చేశాడు. శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్, సూరి ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు.