తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మెహరీన్. ఈ అందాల భామ నిశ్చితార్థం ఆమె ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో ఇటీవల రాజస్థాన్‌లో ఘనంగా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. పెళ్లి, కాబోయే భర్త, కెరీర్ గురించి పలు విషయాలను పంచుకుంది. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తానని స్పష్టం చేసిన ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటానని ధీమా వ్యక్తం చేసింది.
తన నిర్ణయాలను గౌరవించి అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం తన అదృష్టమని వెల్లడించింది మెహరీన్. ఈ ఏడాది చలికాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు తెలిపిన ఈమె.. తొలుత గురుద్వారాలో పంజాబీ స్టైల్లో, ఆ తర్వాత అదే రోజు హిందూ రీతిలో వివాహం చేసుకోనున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత దిల్లీకి తన మకాంను మారుస్తానని చెప్పుకొచ్చింది.
మెహరీన్‌కు కాబోయే వరుడు భవ్య బిష్ణోయ్ హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో తన ప్రేమ విషయాన్ని మెహరీన్ తెలియజేసింది. నాని 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో మెహరీన్ తెలుగుతెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్2' లాంటి చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం 'ఎఫ్3'లో నటిస్తోంది.
ఇదీ చూడండి: పరిచయమైన ఆరురోజులకే పెళ్లి ప్రతిపాదన: మెహరీన్
ఇదీ చూడండి: ఘనంగా హీరోయిన్ మెహరీన్ నిశ్చితార్థం