ETV Bharat / sitara

'ప్రియాంకతో 'నాగిని​' తెరకెక్కించాలనుకున్నా' - నాగిని

బుల్లితెర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుని.. బాలీవుడ్​లో పలు చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకుంది ఏక్తా కపూర్​. ఆమె నిర్మాణంలో రూపొందిన 'నాగిని​' ధారావాహికను సినిమాగా తెరకెక్కించాలనుకున్న విషయాన్ని తాజాగా ప్రస్తావించింది. అయితే కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని తెలిపింది.

When Priyanka Chopra said 'yes' to play Naagin in Ekta Kapoor's film
'ప్రియాంకతో 'నాగిని​' సినిమా తెరకెక్కించాలనుకున్నా'
author img

By

Published : Mar 23, 2020, 1:46 PM IST

బాలీవుడ్​ బుల్లితెర కార్యక్రమాలతో పాటు పలు సినిమాల నిర్మాణ బాధ్యతలు చేపట్టింది ఏక్తాకపూర్​. బుల్లితెరలో ప్రసారమయ్యే 'నాగిని' ధారావాహికకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నాలుగో సీజన్ టెలివిజన్​లో​ ప్రసారం అవుతోంది. గతంలో ఈ కథాంశంతో వెండితెరపై ఆమె సినిమా తీయాలనుకుందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పింది.

"డర్టీ పిక్చర్​ సినిమా తర్వాత 'నాగిని' ధారావాహికను వెండితెరపై తీసుకొచ్చే క్రమంలో కత్రినా కైఫ్​, ప్రియాంక చోప్రాను సంప్రదించాం. కత్రినాకు జానపద చిత్రాలపై ఆసక్తి లేకపోవడం వల్ల దీన్ని సున్నితంగా తిరస్కరించింది. ప్రియాంక చోప్రా అంగీకారం తెలిపినా.. ఆ సమయంలో హాలీవుడ్​ చిత్రంతో బిజీగా ఉండటం వల్ల అది కార్యరూపం దాల్చలేదు. స్టార్​ హీరోలతో చిత్రాన్ని నిర్మించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ, నాకు ప్రియాంక.. కత్రినా లాంటి హీరోయిన్లతో సినిమా తెరకెక్కించాలని ఉంది."

- ఏక్తా కపూర్​, బాలీవుడ్​ నిర్మాత

నిర్మాతగా అటు బుల్లితెరతోపాటు వెండితెరపైనా తన కెరీర్​ను అన్ని విధాలుగా సమన్వయం​ చేసుకోవాలనుకుంటోంది ఏక్తా కపూర్​. దీంతో పాటు కొన్ని వెబ్​సిరీస్​లనూ నిర్మిస్తోంది. ప్రస్తుతం 'ఏక్​ విలన్​' సీక్వెల్​కు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఇదీ చూడండి.. జనతా కర్ఫ్యూ ఉల్లంఘన.. మండిపడ్డ విశ్వక్​సేన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.