బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ పెళ్లి చేసుకోనున్నారంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ దీని గురించే చర్చించుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా.. తన వివాహం విషయమై మాట్లాడింది. ప్రస్తుతం ఆ ఆలోచనే లేదని చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అని అందరూ ఎందుకు అడుగుతున్నారు? మీకు తెలుసు నా వయసు ఇంకా 25 ఏళ్లే. ఇప్పుడు వివాహం చేసుకోవడమనేది తొందరపాటు పని అవుతుంది"
-ఆలియా భట్, హీరోయిన్
2018లో సోనమ్ కపూర్- ఆనంద్ ఆహుజా పెళ్లి వేడుకలో రణ్‌బీర్-ఆలియా కలిసి కనిపించడం వల్ల వీరి మధ్య ప్రేమ చిగురించిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆలియా.. 'గంగూబాయ్', 'ఆర్ఆర్ఆర్', 'బ్రహ్మస్త్ర' సినిమాల్లో నటిస్తుండగా... రణ్‌బీర్ 'బ్రహ్మస్త్ర', 'లవ్ రంజన్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈమధ్యే వీరిద్దరూ గోవాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఆ ఫొటోలు వైరల్‌గానూ మారాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి : రణ్‌బీర్-అలియా గోవా ఎందుకెళ్లారు?