సుశాంత్ సింగ్ ప్రేయసి రియా చక్రవర్తి కనిపించట్లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని కొన్ని వార్తాసంస్థలు చెబుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య విషయంలో ఈమె కుటుంబానికి సంబంధం ఉందని అతడి తండ్రి ఇటీవలే పోలీసులను ఆశ్రయించాడు. రియా కుటుంబంతో పాటు మరో ఆరుగురిపై అనుమానం వ్యక్తం చేస్తూ పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటినుంచి ఈమె ఆచూకీ తెలియట్లేదట.
అజ్ఞాతంలో నటి రియా
సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో పట్నా నుంచి నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబయికి మంగళవారం చేరుకుంది. నటి రియా కోసం ఆమె ఇంటికి వెళ్లగా, అక్కడ లేదని తెలుస్తోంది. కేకే సింగ్ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు వ్యతిరేకంగా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుందని సమాచారం. పోలీసులకు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిందని కొన్ని వార్తాసంస్థలు అంటున్నాయి.