సినీ నటులకు హ్యాకింగ్ ఇక్కట్లు తప్పడం లేదు. కొన్ని నెలల క్రితం అమితాబ్ బచ్చన్, షాహిద్ కపూర్, అద్నన్ సమీ ట్వీట్టర్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ సంఘటన మర్చిపోక ముందే మరో బాలీవుడ్ నటి ఎకౌంట్ హ్యాక్ అయింది. తన అనుమతి లేకుండా తన ఖాతాను వేరెవరో ఉపయోగిస్తున్నారని, అందులోని పోస్ట్‌లకు స్పందించవద్దని చెప్పింది కబీర్ సింగ్ హీరోయిన్ కియారా అడ్వాణీ.
"నా ట్వీట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. ఇది ఎలా జరిగిందో తెలుసుకునే పనిలోనే ప్రస్తుతం మేము ఉన్నాం. ఈ ఎకౌంట్ నుంచి వస్తున్న అపరిచిత ట్వీట్లను పట్టించుకోకండి. అనుమానంగా ఉన్న లింకులను క్లిక్ చేయకండి" - కియారా అడ్వాణీ, బాలీవుడ్ నటి.
![What! Kiara Advani's Twitter account hacked?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4703525_kk.jpg)
ఇటీవల కాలంలో ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అమితాబ్ బచ్చన్, షాహిద్ కపూర్ ఎకౌంట్ల హ్యాక్ అయ్యాయి. తర్వాత వారు ఆ సమస్యను పరిష్కరించుకున్నారు.
![What! Kiara Advani's Twitter account hacked?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4703525_kkd.jpg)
ప్రస్తుతం భూల్భూలియా-2 చిత్రంలో నటిస్తోంది కియారా. వచ్చే ఏడాది జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. అంతేకాకుండా అక్షయ్‌కుమార్ సరసన లక్ష్మీబాంబ్లోనూ మెరవనుంది.
ఇదీ చదవండి: కవచం సినిమా రీమేక్‌లో హీరో విష్ణువిశాల్..?