ETV Bharat / sitara

త్వరలోనే తీపి రుచి చూస్తామంటున్న సెలబ్రిటీలు

author img

By

Published : Mar 25, 2020, 2:20 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఉగాది రుచులను మరచి చేదును చూస్తున్నాం. ఈ పరిస్థితులు కొద్దిరోజులు మాత్రమేనని, త్వరలోనే తీపిని రుచి చూస్తామంటున్నారు కొందరు సెలబ్రిటీలు. శార్వరి నామ సంవత్సరాది శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.

We will be tasted sweet soon at home: Celebrities
త్వరలోనే తీపి రుచి చూస్తామంటున్న సెలబ్రిటీలు

కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం మనం చేదును రుచి చూస్తున్నాం. కానీ త్వరలోనే తీపిని రుచి చూస్తామని అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. తెలుగు సంవత్సరాది పర్వదినాన్ని పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండి, శార్వరి నామ సంవత్సరాదిని కుటుంబసభ్యులతో సరదాగా జరుపుకోవాలని కోరారు.

"అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తుకువచ్చేది పచ్చడి. జీవితంలో తీపి, చేదు రెండు ఉంటాయనే సందేశాన్ని అది మనకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న కరోనా సమస్య మనకు చేదును రుచి చూపిస్తుంది. జీవితంలో ఇది ఓ భాగం. త్వరలోనే తీపి రుచి చూస్తాం. ఆరోజులు మళ్లీ రావాలంటే అందరూ తప్పకుండా ఇంట్లోనే ఉండండి. అత్యవసరానికి తప్ప బయటకు రాకండి. ఈ ఏడాది ఉగాదిని ఇంట్లోనే ఆనందం, ఆరోగ్యంగా జరుపుకోండి."

- సుధీర్‌ బాబు

"అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కరోనా కల్లోలం త్వరగా తొలగిపోవాలని దేవుడిని ప్రార్థిద్దాం. మీ కుటుంబం, స్నేహితుల గురించి ఆలోచించి బయటకు రాకండి. లవ్‌ యూ ఆల్‌. శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు."

- అడివి శేష్‌

"ప్రకృతిని కాపాడుకోండి, పెద్దల మాటను గౌరవించండి. మీ ఇంటిల్లిపాదికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలతో వందేళ్లు క్షేమంగా ఉండాలని ఆ షిర్డీ సాయినాథుడిని కోరుకుంటున్నాను."

- మోహన్‌ బాబు

  • ప్రకృతిని కాపాడుకోండి, పెద్దల మాటను గౌరవించండి. మీ ఇంటిల్లపాదికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలతో వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఆ షిర్డీ సాయి నాధుని కోరుకుంటున్నాను. #HappyUgadi #Ugadi #Ugadi2020

    — Mohan Babu M (@themohanbabu) March 25, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీకు, మీ కుటుంబ సభ్యులకు శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. ఇది అసాధారణ కాలం. సంకల్పం, సహనం, పరిపక్వతతోనే మనం విజయం సాధిస్తాం."

- మంచు విష్ణు

"ప్రతి ఒక్కరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ 21 రోజులు ఇంట్లోనే ఉండండి. కుటుంబసభ్యులకు సమయాన్ని కేటాయించండి"

- కల్యాణ్‌రామ్‌

"హ్యాపీ ఉగాది. కరోనా వైరస్‌ రావడం వల్ల ప్రస్తుతం ఉన్న దురదృష్టకరమైన పరిస్థితుల్లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ ఏడాది పండుగను సరదాగా జరుపుకోలేమని నాకు తెలుసు. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రతతోపాటు, పలు జాగ్రత్తలను పాటించడం వల్ల త్వరలోనే కరోనా నివారణతో దేశం మొత్తం కలిసి ఓ పెద్ద పండుగను జరుపుకొందాం అని ఆశిద్దాం"

- రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

  • Happy Ugadi.I know we cannot celebrate with family n friends at this point due to d unfortunate situation but let’s be hopeful and take all precautions like social distancing n hygiene so that we can hv a bigger celebration as a country together in days to come.#stayhomestaysafe pic.twitter.com/aN7P1YgokY

    — Rakul Singh (@Rakulpreet) March 25, 2020

ఇదీ చదవండి: ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ తొలి ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.