బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను ఓ వాచ్‌మన్ హెచ్చరించాడు. ఓ అబ్బాయికి సెల్ఫీ ఇచ్చే సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?
ముంబయిలోని ఓ జిమ్ నుంచి బయటకొస్తున్న జాన్వీను ఓ కుర్రాడు సెల్ఫీ అడిగాడు. తను ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, అక్కడికి ఓ వాచ్‌మన్ వచ్చి, ఆమెను హెచ్చరించాడు. ఆ అబ్బాయి మిమ్మల్మి గాయపరిచే అవకాశముందని అన్నాడు. తాను గత 25 ఏళ్ల నుంచి ఇదే ప్రాంతంలో ఉంటున్నానని, అందుకే ఈ అబ్బాయితో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఆ తర్వాత కారు ఎక్కి ఇంటికి వెళ్లిపోయింది జాన్వీ.
2018లో 'దఢక్'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం 'ఘోస్ట్ స్టోరీస్' వెబ్‌సిరీస్, గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్', హారర్ సినిమా 'రూహ్ అఫ్జా', కరణ్ జోహార్ 'తఖ్త్'లో నటిస్తోంది. ఇవన్నీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.