కౌగిలింత... ఒత్తిడిని దూరం చేసి, ప్రేమను పంచుతుంది. ఈ ఫార్ములాను చాలా సినిమాల్లో చూపించారు. తాజాగా ఆ సూత్రాన్ని నిజ జీవితంలోనూ ఉపయోగించి వైరల్‌గా మారింది బాలీవుడ్ నటి రిచాచద్దా. జనవరి 21న 'జాతీయ కౌగిలింతల దినోత్సవం' సందర్భంగా ఈ భామ వినూత్న ఆలోచనను పాటించింది. ముంబయిలో తన వీధిలో వెళ్తున్న అపరిచితులకు కౌగిలింతలు ఇచ్చింది.
చేతిలో 'ఫ్రీ హగ్స్' అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని మరీ అందర్నీ ఆప్యాయంగా పలకరించింది. ఈ సందర్భంగా తీసిన వీడియోను రిచా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ప్రతి ఏడాది ఇలా చేయాలనిపిస్తోందని పేర్కొంది.
" ఈ ప్రపంచంలో ఎంతో ద్వేషం ఉంది.. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలి అనుకున్నా. నేను అపరిచితుల్ని కౌగిలించుకున్నా.. ఇది ఓ మ్యాజిక్‌లా అనిపించింది. ప్రతి ఏడాది ఇలా చేయాలి అనిపిస్తోంది. వచ్చే ఏడాది మీరు నన్ను కలవొచ్చు... సంతోషంగా ఉండండి, ప్రేమను పంచండి"
-- రిచాచద్దా, బాలీవుడ్ నటి
రిచా పోస్టు చేసిన వీడియోకు నెట్టింట విపరీతంగా స్పందన లభిస్తోంది. కొందరు రిచా చద్దాను మెచ్చుకున్నారు. మరి కొందరు 'స్వీట్.. మీరు లక్షల మందికి స్ఫూర్తి, బాగా ఆలోచించారు, చాలా రోజుల తర్వాత నేను చూసిన ది బెస్ట్ వీడియో ఇది..' అని కామెంట్లు పెట్టారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">