యాసిడ్... అత్యంత ప్రమాదకరమైన రసాయనం మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో దాడులకు కుడా వినియోగిస్తున్న ద్రావణం. అందుకే వీటి కొనుగోళ్లపై నిఘా ఉంచాలని ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. అయితే నిబంధనలు, నియమాలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా యాసిడ్ అమ్మకాలు జరుగుతున్నాయని... తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె చేసిన ఓ స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది.
సాధారణంగా యాసిడ్ అమ్మే దుకాణదారుడికి కొనుగోలు చేసే వ్యక్తి గుర్తింపుకార్డు చూపించాలి. అంతేకాకుండా చిరునామా తీసుకోవాలి. ఫలానా వ్యక్తి యాసిడ్ కొన్నాడనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. కానీ ఇవేవీ జరగడం లేదని చెప్పింది దీపిక. దేశంలో యాసిడ్ కొనడం చాలా సులభమని, తన బృందం ద్వారా 24 యాసిడ్ సీసాలు కొన్నట్లు తెలిపింది.
ఇలా ఆపరేషన్...!
దీపిక టైటిల్ రోల్ పోషించిన సినిమా 'ఛపాక్'. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. ఈ సినిమా నేపథ్యంలో దీపిక ఇటీవల యాసిడ్‌దాడి బాధితుల పట్ల సమాజం ప్రవర్తిస్తున్న తీరును తెలుపుతూ ఇప్పటికే ఓ వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు మరో వీడియోను షేర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
ఈ ఆపరేషన్లో భాగంగా తన చిత్రయూనిట్లో కొందరు వ్యాపారవేత్త, విద్యార్థి, గృహిణి, ప్లంబర్.. ఇలా రకరకాల వేషాల్లో దుకాణాలకు వెళ్లి యాసిడ్ కొనుగోలు చేశారు. ఈ స్టార్ నటి తన కారులో కూర్చుని రహస్య కెమేరాల ద్వారా గమనించింది. కొందరు దుకాణాల్లో ఎటువంటి గుర్తుంపు కార్డు చూడకుండానే యాసిడ్ ఇచ్చారు. మరి కొందరు మాత్రం ఐడీలు అడిగారు. సుప్రీం కోర్టు నిబంధనలు పెట్టినప్పటికీ.. ఒక్క రోజులో 24 యాసిడ్ సీసాలు కొనగలిగామంటే నమ్మలేకపోతున్నానని దీపిక ఆశ్చర్యం వ్యక్తం చేసింది. యాసిడ్ కొనుగోలు, అమ్మకాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని కోరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">