ETV Bharat / sitara

'ఆ వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యా' - లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఇరా ఖాన్

చిన్నతనంలోనే తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు బాలీవుడ్​ నటుడు ఆమిర్​ఖాన్​ కుమార్తె ఇరాఖాన్​ అంటోంది. దీంతో ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నట్లు ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో ద్వారా వెల్లడించింది.

Was Sexually Abused When I was 14: Aamir Khan's Daughter Ira
'ఆ వయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యాను'
author img

By

Published : Nov 2, 2020, 6:50 PM IST

పద్నాలుగేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురైనట్లు బాలీవుడ్​ నటుడు ఆమిర్​ ఖాన్​ కుమార్తె ఇరా ఖాన్​ తాజాగా వెల్లడించింది. ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిన వీడియోలో తాను ఏ విధమైన ఒత్తిడిని ఎదుర్కొందనే విషయంతో పాటు దాని వెనకున్న కారణాల కోసం ఎలా ప్రయత్నించిందో ఆమె తెలిపింది. నెల రోజులుగా క్లినికల్​ డిప్రెషన్​తో బాధపడుతున్నట్లు ఇరా చెప్పింది.

"14 ఏళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యా. ఆ సమయంలో అతడు ఏమి చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఆ వ్యక్తి చేసిన చర్యల గురించి తెలుసుకోవడానికి నాకు ఏడాది కాలం పట్టింది. ఆ వెంటనే నేను నా తల్లిదండ్రులకు ఓ మెయిల్​ ద్వారా నా పరిస్థితిని వెల్లడించా. ఆ ఘటన నుంచి బయటకు వచ్చిన తర్వాత కాస్త ఉపశమనం పొందా. అప్పటి నుంచి భయపడలేదు".

- ఇరా ఖాన్, ఆమిర్​ఖాన్​ కుమార్తె

ఇరా ఖాన్​ తల్లిదండ్రులైన ఆమిర్​ఖాన్​, రీనా దత్తా విడాకులు తీసుకున్నా.. ఆ సంఘటన తనను అంతగా బాధించలేదని ఆమె పేర్కొంది. "నా చిన్నతనంలో మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. కానీ, వారు స్నేహపూర్వకంగా విడిపోయిందున నాకు అది పెద్దగా బాధించలేదు. వారు ఇప్పటికి స్నేహితులుగా ఉన్నారు. మేమంతా విడిపోయిన కుటుంబం అయితే కాదు" అని ఇరా వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.