హాలీవుడ్ నిర్మాణ సంస్థ 'వార్నర్ బ్రదర్స్'చీఫ్ కెవిన్ సుజిహార లైంగిక ఆరోపణలతో ఆ స్థానం నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ధ్రువీకరించారు.
" 25 ఏళ్లుగా స్టూడియోకు కెవిన్ సేవలందిస్తున్నారు. అందుకు కృతజ్ఞతలు. ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు".
--జాన్ స్టాన్కే, వార్నర్ మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్
బ్రిటీష్ నటి చార్లొటె కిర్క్, సుజిహార మధ్య నడిచిన మెసేజ్‌ల పర్వాన్ని ఓ హాలీవుడ్ రిపోర్టర్ బట్టబయలు చేశారు. దీనిపై మార్చి నెల ప్రారంభంలోనే విచారణకు ఆదేశించింది వార్నర్ బ్రదర్స్. లైంగిక అవసరాలు తీరిస్తేనే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని సుజిహార అన్నారని ఆ మెసేజ్‌ల్లో తేలింది.
"సంస్థలో కొనసాగడం వల్ల స్టూడియోకు నష్టం వాటిల్లుతుంది. ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నా వల్ల సంస్థ పేరు చెడకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా".
- సుజిహార, వార్నర్ బ్రదర్స్ చీఫ్
ప్రస్తుతం కొత్త చీఫ్‌ను వెతికే పనిలో ఉంది వార్నర్ బ్రదర్స్ సంస్థ.