విశ్వక్ సేన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'పాగల్'. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్ నాయిక. తాజాగా విశ్వక్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తూ చిత్ర రిలీజ్ తేదీనీ ప్రకటించింది చిత్రబృందం. ఇందులో కళ్లద్దాలు పెట్టుకుని, పూల చొక్కా ధరించి ట్రెండీ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు విశ్వక్.

'ఏప్రిల్ 30న మీ హృదయాలు దోచుకునేందుకు పాగల్ రాబోతున్నాడు' అని ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ సినిమాను లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్. హీరోగా విశ్వక్‌కి ఇది 5వ సినిమా.