విజయ్ సేతుపతి, జయరామ్ కథానాయకులుగా నటించిన మలయాళ చిత్రం 'మార్కోని మతాయ్'. లక్ష్మీచెన్నకేశవ ఫిల్మ్స్ పతాకంపై డి.వి.కృష్ణస్వామి ఆ చిత్రాన్ని 'రేడియో మాధవ్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదనే కథాంశంతో వినోదభరితంగా సనల్ కలతిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రేడియో జాకీగా విజయ్ సేతుపతి కనిపించనున్నారు. అనువాద కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
'తెనాలి', 'పంచతంత్రం', 'భాగమతి' తర్వాత 'అల వైకుంఠపురములో' నటించిన తనను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారని, రేడియో మాధవ్ కూడా తెలుగువారిని ఆకట్టుకుంటుందని జయరామ్ అన్నారు.
ఇదీ చూడండి: వంటల ప్రోగ్రామ్ హోస్ట్‌గా విజయ్ సేతుపతి!