విభిన్న పాత్రల్లో అలరించే హీరోల్లో తమిళ నటుడు సూర్య ముందుంటాడు. ప్రతిసారి కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తుంటాడు. ప్రస్తుతం 'బందోబస్త్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదల కానుంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల రెండో వారంలో జరపనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వస్తాడని తెలుస్తోంది. ఇంతకుముందు దేవరకొండ 'నోటా' సినిమా తమిళ ఫంక్షన్‌కు సూర్య అతిథిగా వెళ్లాడు.
'బందోబస్త్' సినిమాకు 'రంగం' ఫేం కె.వి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయేషా సెగల్ హీరోయిన్గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఆర్య, బోమన్ ఇరానీ, సముద్ర ఖని, నాగినీడు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇవీ చూడండి.. 'సాహో' చిత్రంపై లార్గోవించ్ దర్శకుడి ఘాటు వ్యాఖలు