ETV Bharat / sitara

ఫ్యాషన్​ డిజైనర్​తో 'ఊసరవెల్లి' నటుడి నిశ్చితార్థం - విద్యుత్ జమ్వాల్​

అభిమానుల ఊహాగానాలను నిజం చేశాడు బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్​. ఫ్యాషన్​ డిజైనర్​ నందితా మహతానితో తనకు నిశ్చితార్థం(Vidyut Jammwal engaged ) అయినట్లు తెలిపాడు.

Vidyut jamwal engagement
విద్యుత్ జమ్వాల్ నిశ్చితార్థం
author img

By

Published : Sep 13, 2021, 1:44 PM IST

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్​పై అభిమానుల ఊహాగానాలు నిజమయ్యాయి. ఆయనకు ఫ్యాషన్​ డిజైనర్​ నందితా మహతానితో నిశ్చితార్థం(Vidyut Jammwal engaged) జరిగిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్​స్టా వేదికగా వెల్లండిచాడు.

అసలేం జరిగిందంటే..?

ఇటీవల జమ్వాల్​, మహతాని కలిసి తాజ్​మహాల్​ను సందర్శించారు. దీంతో వారిద్దరికి ఎంగేజ్​మెంట్​ అయినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఆ విషయంపై అప్పుడు మౌనం వహించిన జమ్వాల్​.. నిశ్చితార్థం జరిగిందని​ ఇన్​స్టా వేదికగా తెలిపాడు. తన 'కమాండో' సినిమా స్టైల్​లో ఎంగేజ్​మెంట్​ జరిగినట్లు పేర్కొన్నాడు.

Vidyut Jammwal
విద్యుత్, నందితా మహతాని

ప్రస్తుతం.. జమ్వాల్​ 'ఖుదా హఫీజ్​'(Vidyut Jamwal movies) షూటింగ్​తో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్​లో 'ఫోర్స్'​ సినిమాతో తెరంగేట్రం చేసిన జమ్వాల్​ 'కమాండో' సిరీస్​తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో 'శక్తి', 'ఊసరవెల్లి'తో పాటు తమిళ నటులు సూర్య, విజయ్​ నటించిన పలు చిత్రాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు.

Vidyut Jammwal
విద్యుత్, నందితా మహతాని

కాగా.. గతంలో నటులు డినో మోరియా, రణబీర్ కపూర్‌లతో మహతాని డేటింగ్​లో ఉన్నట్లు వదంతులు వచ్చాయి. అనంతరం దిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్​ కపూర్‌ను వివాహం చేసుకున్నారు మహతాని. తర్వాత ఆ జంట విడిపోయింది.

ఇదీ చూడండి: రిలయన్స్, టీ-సిరీస్ ఒప్పందం.. భారీ సినిమాలే లక్ష్యంగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.