ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ మరో విభిన్న చిత్రం చేసేందుకు అంగీకరించింది. 'మానవ కంప్యూటర్ శకుంతల దేవి' జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. సంబంధిత పోస్టర్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకుందీ హీరోయిన్.
అను మేనన్ దర్శకత్వం వహిస్తుండగా విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2020 వేసవిలో విడుదల కానుంది.
"శకుంతల దేవి పాత్రలో నటించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో ఘనతల్ని ఆమె సాధించింది. అలాంటి మహిళ పాత్రలో నటించడం ఆనందంగా ఉంది." - విద్యాబాలన్, ప్రముఖ హీరోయిన్.
తెలుగులో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్: కథానాయకుడు, మహానాయకుడు' చిత్రాల్లో బసవతారకం పాత్రలో నటించిందీ విద్య.