ETV Bharat / sitara

ఆ పాత్ర కోసం విద్యాబాలన్​ 75సార్లు ఆడిషన్! - ఆ పాత్ర కోసం విద్యాబాలన్​ 75 సార్లు ఆడిషన్​

2005లో విడుదలైన 'పరిణితి' సినిమాలోని తన పాత్ర కోసం బాలీవుడ్​ ప్రముఖ నటి విద్యాబాలన్​ 75సార్లు ఆడిషన్​ ఇచ్చినట్లు తెలిపారు ప్రముఖ సంగీత దర్శకుడు షంతాను మొయిత్రా. సంకల్పం ఉంటే విజయం తప్పక వరిస్తుంది చెప్పడానికి విద్యానే నిదర్శమని అన్నారు.

vidyabalan
విద్యాబాలన్​
author img

By

Published : Jul 1, 2020, 8:43 PM IST

ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు.. కొన్నికొన్నిసార్లు ఆటుపోట్లు ఎదురవుతాయని.. కానీ వాటిని జయిస్తూ ముందుకు సాగాలని ప్రముఖ సంగీత దర్శకుడు షంతాను మొయిత్రా తెలిపారు. బలమైన సంకల్పం ఉంటే విజయం తప్పక వరిస్తుందన్నారు. ఇందుకు బాలీవుడ్​ ప్రముఖ నటి విద్యాబాలన్ నిదర్శనమని వెల్లడించారు.

'పరిణితి' సినిమాలోని తన పాత్రకోసం విద్యాబాలన్​ 75సార్లు ఆడిషన్​ ఇచ్చినట్లు గుర్తుచేశారు మొయిత్రా.

"'పరిణితి' సినిమా ఆడిషన్​ను చూద్దామని నేను వెళ్లాను. అప్పటికే ఆడిషన్​ ఇవ్వడానికి విద్యాబాలన్ వచ్చింది. తనతో పాటు అనేక మంది ప్రస్తుత పెద్ద హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ రోజు.. సినిమాలోని తన పాత్ర పండించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది విద్యాబాలన్​. కానీ తాను నటించిన విధానం అక్కడ ఎవరికీ నచ్చలేదు. అలా దాదాపు 74సార్లు ఇచ్చినా ఆడిషన్ విఫలమైపోయింది. కానీ తాను నిరుత్సాహపడలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది. ఎట్టకేలకు 75వ సారి అద్భుతంగా నటించి అందరినీ ఫిదా చేసింది. బలమైన సంకల్పం ఉంటే విజయం వరిస్తుందనటానికి ఇదే నిదర్శనం."

-షంతాను మొయిత్రా, సంగీత దర్శకుడు.

ఈ సినిమాలో సైఫ్​ అలీఖాన్​, సంజయ్​ దత్​, దియా మిర్జా కూడా నటించారు. ప్రదీప్​ సర్కార్​ దర్శకత్వం వహించారు. 2005లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

ఇది చూడండి : నేను అలాంటి బాధను ఎదుర్కొన్నవాడినే: సైఫ్ అలీఖాన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.