ETV Bharat / sitara

విక్కీ, రాజ్​ కుమార్ అపార్ట్​మెంట్లో కరోనా అలజడి - కరోనా ఎఫెక్ట్​

బాలీవుడ్​ హీరోలు విక్కీ కౌశల్​, రాజ్​కుమార్​ రావు నివసించే అపార్ట్​మెంట్​లోని ఓ బాలికకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీంతో వారు నివసిస్తున్న గృహ సముదాయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ తెలిపింది.

Vicky, Rajkummar's housing complex partially sealed after confirmed positive COVID-19 case
బాలీవుడ్​ ప్రముఖులకు కరోనా తాకిడి
author img

By

Published : Apr 21, 2020, 4:49 PM IST

బాలీవుడ్​ తారలు నివసిస్తున్న గృహ సముదాయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అందులో నివసిస్తున్న 11 ఏళ్ల బాలికకు కరోనా సోకడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ తెలిపింది. ఈ సముదాయాల్లో విక్కీ కౌశల్​, రాజ్​కుమార్​ రావు, పత్రలేఖ, చిత్రాంగద సింగ్​లు ఉంటున్నారు.

ఈ పరిణామంతో అందులో నివసించే ప్రతి ఒక్కరూ విధిగా నిర్బంధాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్​ కేసులు నమోదవ్వడం వల్ల నటుడు అంకిత్​ లోఖండేతో సహా చలనచిత్ర, టెలివిజన్​ నటుల భవన సముదాయాలను ఇప్పటికే మూసివేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్​ ప్రముఖులు

ఇప్పటివరకు కరోనా బారిన పడిన బాలీవుడ్​ ప్రముఖుల్లో నిర్మాత కరీం మొరానీ, అతని కుమార్తెలు జోవా, షాజా మొరానీ, గాయని కనికా కపూర్​ ఉన్నారు. వీరంతా కొవిడ్​-19 బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.

ఇదీ చూడండి..'పవన్ రోజూ 600 కి.మీ ట్రావెల్ చేసేవారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.