బాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రశేఖర్(98)(Chandrasekhar) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిర్మాత అశోక్ శేఖర్ వెల్లడించారు. ఉదయం 7 గంటల సమయంలో నిద్రలోనే శ్వాస విడిచినట్లు తెలిపారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
చంద్రశేఖర్.. హైదరాబాద్లో జన్మించారు. 1950లో చిత్రసీమలో అడుగుపెట్టారు. 1954లో 'సురంగ్'తో సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. 'కవి', 'మస్తానా', 'బసంత్ బహార్', 'కాలి టోపీ లాల్ రుమాల్', 'బర్సాత్ కి రాత్' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ప్రముఖ ధారావాహిక 'రామాయణ్'లోని(Ramayan) ఆర్య సుమంత్ పాత్రతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. మొత్తంగా కెరీర్లో దాదాపు 250కు పైగా చిత్రాలు చేశారు. ఈయనకు ముగ్గురు పిల్లలు.
ఇదీ చూడండి: అద్దెకు సుశాంత్ ఫ్లాట్.. ధర ఎంతంటే?