ఈ ఏడాది ఆరంభంలో 'ఎఫ్2'తో సినీప్రియులను ఆకట్టుకున్నాడు విక్టరీ వెంకటేశ్. ప్రస్తుతం యువహీరో నాగచైతన్యతో 'వెంకీమామ' అనే మల్టీస్టారర్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దర్శకుడు బాబీ ఈ చిత్రం కోసం రెండు విభిన్న క్లైమాక్స్‌లను రూపొందించాడట. అందులో ఒకటి విషాదం, మరోకటి సుఖాంతం.
ఇప్పటివరకు వెంకటేశ్ సినిమాలకు విషాద ముగింపు ఉండటం అరుదు. ఒకవేళ అలా క్లైమాక్స్ రూపొందిస్తే ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారనేది చిత్రబృందానికి ప్రశ్నగా మారింది. అలా కాకుండా మరో ఆనందమైన ముంగింపును డిజైన్ చేశాడీ డైరెక్టర్. ముందైతే రెండింటిని చిత్రీకరించి, ఆ తర్వాత నిర్మాత సురేశ్‌బాబుతో చర్చించి ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
![VENKY MAMA HAS TWO CLIMAXS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4491895_venky-mama-1.jpg)
ఇటీవల కాలంలో కథ, కథనాలు బాగుండి ముగింపు ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకు జెర్సీ సినిమానే ఉదాహరణ. త్వరలో రానున్న 'సైరా'లోనూ ఇటువంటి క్లైమాక్స్ ఉండనుందని సమాచారం.
ఇది చదవండి: విడుదలకు ముందు 'వాల్మీకి' పేరు మార్పు