వెంకీ కుడుముల.. ఇటీవలే వచ్చిన 'భీష్మ'తో రెండో హిట్ అందుకున్నాడు. అంతకు ముందు 'ఛలో'తో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు. నితిన్ హీరోగా నటించిన 'భీష్మ'.. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మూడు రోజులలోనే ఆంధ్రా, తెలంగాణాలలో కలిపి రూ.14.89 కోట్ల షేర్ రాబట్టి అబ్బురపరిచింది. నితిన్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ విజయంతో దర్శకుడు వెంకీ.. హిట్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ఈ క్రమంలో మెగా హీరోతో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకున్నాడని టాక్.
ఇప్పటికే రామ్ చరణ్‌కు కథకు సంబంధించిన ఒక లైన్ చెప్పాడని, ఆసక్తి కనబర్చిన చరణ్.. పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మన్నాడని తెలుస్తోంది. అన్ని కుదిరితే 2021లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందట. ఈ విషయంపై ఓ స్పష్టత రావాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిందే.
ఇదీ చూడండి : హీరోయిన్ జాన్వీ కపూర్‌ను హెచ్చరించిన వాచ్‌మన్