హీరో వెంకటేశ్ మరో హిట్ రీమేక్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన 'అసురన్' తెలుగు రీమేక్‌తో(నారప్ప, Venkatesh narappa cinema) వచ్చి ఓటీటీలో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులోని వెంకీ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ క్రమంలోనే వెంకీ మరో రీమేక్ చేయాలనే ఆలోచనలో పడ్డారట. తమిళ స్టార్ అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'ఎన్నై అరిందాల్'ను తెలుగులో చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ మూవీ తెలుగులో 'ఎంతవాడుగానీ'(yentavadu gaani movie telugu) పేరుతో డబ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' చిత్రంలో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: 'నారప్ప' పాత్రతో బాగా కనెక్ట్ అయ్యా: వెంకీ