Venditera Velpulu about Director Vamsy: తేనె తెలుగులో ముంచి, పల్లె సీమల ఆత్మీయతలను పట్టితెచ్చి.. వెండితెరపై దృశ్యకావ్యాలు విరచించిన విపంచి ఆయన... పాపికొండల బోటు, ఆత్రేయపురం పూతరేకు, ఆర్టోసు కూల్ డ్రింకు, కథానాయకి కట్టుబొట్టులో ఆత్మవిశ్వాసం, కడియం పూలబుట్ట, మాఘమాసంలో నారింజ పరిమళం ఆయన ట్రేడ్‌మార్కులు... ఆయన కావ్యనాయిక సినీ కథానాయక. తళుకులీనే తటిల్లత, వెండితెర విద్యుల్లత. పల్లెదనానికి, పచ్చదనానికి నెచ్చెలి.. ఇంతకీ ఈ పరిచయం ఎవరి గురించో మీకు అర్థం అయిపోయుండాలిగా.. ఆయనే దర్శకుడు వంశీ.
'వెండితెర వేల్పులు' కార్యక్రమంలో ఈ వారం 'వైవిధ దర్శకుడు వంశీ' సినీప్రస్థానం అలరించేందుకు సిద్ధమైంది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానెల్స్‌లో ఈనెల 16, ఆదివారం ఉదయం 10.30గం.కు, సాయంత్రం 6.30గం.కు, రాత్రి 10.30 గం.కు తప్పక చూడండి.
ఇదీ చూడండి: సినీ వినీలంలో అసాధ్యుడు.. అనితరసాధ్యుడు.. సాహసాల కృష్ణ