మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ ఇటీవలే 'గద్దలకొండ గణేష్'గా మాస్ కథాంశంతో వచ్చి విజయం అందుకున్నాడు. దీంతో ఆయన తర్వాతి చిత్రంపై సినీవర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వాళ్ల ఊహకు తగ్గట్టుగా బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'బాక్సర్' అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఈ కథలో విలన్ పాత్ర కీలకంగా ఉండబోతుందట. మరి ఇలాంటి వైవిధ్యభరిత ప్రతినాయక పాత్ర పోషించేందుకు ఎవరు బావుంటారని వెతికే ప్రయత్నంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు ప్రముఖంగా వినిపించింది. 'సైరా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయ్‌సేతుపతి ఏ పాత్రలోనైనా పరకాయం ప్రవేశం చేయగలడు. దీంతో ఈ పాత్రకు అతనే కావాలనుకుందట చిత్ర బృందం. కానీ, పలు కారణాల వల్ల విజయ్ స్థానంలో మరో నటుడ్ని ఎంపిక చేయబోతున్నారని సమాచారం. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరి వరుణ్‌తో ఎవరు తలపడతారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదీ చూడండి.. 'అల.. వైకుంఠపురములో' బన్నీ ఆల్‌టైమ్ రికార్డు!