ETV Bharat / sitara

200 కి.మీ. నడిచి.. వరుణ్​తేజ్​ను కలిసి..! - 200 కి.మీ నడిచొచ్చిన వరుణ్​తేజ్​ అభిమాని

మెగాప్రిన్స్​ వరుణ్​తేజ్​ కోసం దాదాపు 200 కి.మీ. కాలినడకన వచ్చాడు ఓ వీరాభిమాని. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన బాలు అనే వ్యక్తి వరుణ్​ను కలవాలని పాదయాత్ర చేసి హైదరాబాద్​ చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో.. ఆ అభిమానిని కలిసి ముచ్చటించారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

Varun Tej's fan walks more than 200 kms to meet the ghani star
200 కి.మీ. నడిచివచ్చి.. వరుణ్​తేజ్​ను కలిసి..!
author img

By

Published : Jan 31, 2021, 10:33 PM IST

తనను చూసేందుకు కోసం 200 కి.మీ. నడిచొచ్చిన ఓ సూపర్‌ అభిమానిని మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కలిశారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన బాలు అనే వ్యక్తికి మెగా కుటుంబం, ముఖ్యంగా వరుణ్‌తేజ్‌ అంటే అమితమైన అభిమానం. దీంతో అతను వరుణ్‌ని కలవాలని గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలోనే ఇటీవల భిక్కనూరు నుంచి హైదరాబాద్‌ వరకూ 200 కి.మీ. నడుచుకుంటూ వచ్చాడు.

Varun Tej's fan walks more than 200 kms to meet the ghani star
వరుణ్​తేజ్​కు పుష్పకుచ్చం ఇస్తున్న అభిమాని బాలు

అయితే, విషయం తెలుసుకున్న వరుణ్‌తేజ్‌.. తన కార్యాలయానికి సదరు అభిమానిని పిలిపించారు. అతనితో కొంత సమయం మాట్లాడారు. తన పట్ల చూపిస్తున్న అభిమానానికి వరుణ్‌ ఎంతో సంతోషించారు. సదరు అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా అభిమానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు వరుణ్‌ 'గని' షూట్‌లో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు.

వరుణ్​తేజ్​కు పుష్పకుచ్చం ఇస్తున్న అభిమాని

వరుణ్​ తేజ్​తో మాట్లాడుతున్న అభిమాని

ఇదీ చూడండి: కరణ్​జోహార్​ దర్శకత్వంలో జోడీగా రణ్​వీర్​-అలియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.