ETV Bharat / sitara

వరుణ్​ తేజ్ మూడు కీలక పోరాటాలు! - వరుణ్ తేజ్ గని బాక్సింగ్ ఫైట్స్

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందీ సినిమా. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. జులై నుంచి కొత్త షెడ్యూల్​ను ప్రారంభించనుంది.

varun tej
వరుణ్ తేజ్
author img

By

Published : Jun 5, 2021, 6:28 AM IST

మెగాప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గని'. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ జులై నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా మూడు కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. బాక్సింగ్‌ ఆటలో భాగంగా వచ్చే క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌కి చెందిన లార్నెల్‌ స్టోవల్‌, వ్లాడ్‌ రింబర్గ్‌ నేతృత్వంలో వీటిని తెరకెక్కించనున్నారు. దీని కోసమే దాదాపు కోటిన్నర ఖర్చుతో ఓ బాక్సింగ్‌ స్టేడియం సెట్‌ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం మిగిలి ఉన్న చిత్రీకరణలో సింహ భాగం ఇక్కడే పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.