మెగాహీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఇందులో వరుణ్ పాత్రకు సంబంధించిన లుక్ బయటకొచ్చింది. గుబురు గడ్డం, మీస కట్టుతో అదరగొడుతున్నాడీ మెగాహీరో. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు.
తమిళంలో సూపర్‌హిట్ అయిన 'జిగర్తాండ' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోందీ చిత్రం. తమిళ నటుడు అథర్వ, మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
ఇది చదవండి: 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ఎవరు..?