మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఇటీవల నిశ్చితార్థంతో ఒక్కటైన నిహారిక-చైతన్య పెళ్లి గురించి తాజాగా నాగబాబు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"నిహారిక పెళ్లి విషయంలో మేమెంతో సంతోషంగా ఉన్నాం. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఎంతో క్లిష్టంగా మారింది. ఇలాంటి కఠిన సమయం నుంచి కొంతవరకూ బయటకు వచ్చేలా కుటుంబంలో శుభకార్యం జరగడం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను నా కుమారుడు వరుణ్‌తేజ్ చూసుకుంటున్నాడు. డిసెంబర్ నెలలో నిహారిక-చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. పెళ్లి తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తాం. వెడ్డింగ్‌కు సంబంధించి వరుణ్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల పేర్లతో లిస్ట్ సిద్ధం చేశాడు."
-నాగబాబు, నటుడు
గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను తాను పరిణయమాడనున్నట్లు లాక్‌డౌన్ సమయంలో నిహారిక సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. చైతన్యతో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఆగస్టు నెలలో వేడుకగా జరిగింది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం నిహారిక తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్ పార్టీ జరుపుకొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">