ETV Bharat / sitara

'గని' కొత్త రిలీజ్​ డేట్​.. కత్రినా-సేతుపతి మూవీ ఫిక్స్​ - డింపుల్‌ హయాతి

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్ నటించిన 'గని' కొత్త విడుదల తేదీ సహా కత్రినా కైఫ్-విజయ్ సేతుపతిల సినిమా విశేషాలు ఇందులో ఉన్నాయి.

katrina kaif
Varun Tej
author img

By

Published : Dec 25, 2021, 11:22 AM IST

వరుణ్​తేజ్ 'గని' సినిమా కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. 2022 మార్చి 18న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. డిసెంబర్​ 24నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. సిద్ధు, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Varun Tej
'గని'

సేతుపతితో కత్రినా..

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్​లో సినిమా ఖరారైంది. 'అంధాధున్', 'బద్లాపుర్'​ వంటి బ్లాక్​బస్టర్​ చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దీనికి 'మెర్రీ క్రిస్మస్' అనే టైటిల్ ఫిక్స్​ చేశారు.

katrina kaif
'మెర్రీ క్రిస్మస్' చిత్రబృందం

రవితేజ క్రిస్మస్​ విషెస్​..

క్రిస్మస్​ సందర్భంగా మాస్​ మహారాజా రవితేజ నటిస్తోన్న కొత్త సినిమాల పోస్టర్లు విడుదలయ్యాయి. ఆయన హీరోగా రమేష్‌ వర్మ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖిలాడి'. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. ఈ సినిమాలోని మూడో పాటను డిసెంబర్​ 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ravi teja
'ఖిలాడి' పోస్టర్

ఇక రవితేజ​ నటిస్తున్న 'రామారావు ఆన్​ డ్యూటీ' నుంచి మరో పోస్టర్ రిలీజ్ అయ్యింది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్​ మాండవ దర్శకత్వం వహిస్తుండగా.. దివ్యాంశ కౌషిక్​ హీరోయిన్​గా నటిస్తోంది. 2022 మార్చి 25న సినిమా రిలీజ్​ కానుంది.

ravi teja
'రామారావు ఆన్​ డ్యూటీ'

ఇదీ చూడండి: ధనుష్​ మరో కొత్త చిత్రం.. 'ఫైటర్​'లో అనిల్ కపూర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.