ETV Bharat / sitara

వరుస సినిమాలతో బిజీగా వరుణ్ ధావన్ - వరుణ్-కియారా అడ్వాణీ జంటగా

బాలీవుడ్​ నటుడు వరుణ్ ధావన్ వరుస చిత్రాలతో దూకుడు పెంచనున్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో సేదతీరుతున్న వరుణ్.. నవంబర్​ రెండో వారం నుంచి సినిమా షూటింగుల్లో పాల్గొంటానని అన్నారు.

Varun_Dhawan
వరుస సినిమాలతో వరుణ్ ధావన్
author img

By

Published : Oct 25, 2020, 9:20 AM IST

లాక్​డౌన్​తో ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉంటున్న కథానాయకులు, నాయికలు.. ఒక్కసారిగా బిజీ అయిపోతున్నారు. ఒకేసారి రెండు మూడు చిత్రాల షూటింగ్​ల్లో పాల్గొంటున్నారు. కథానాయకుడు వరుణ్ ధావన్ ఇదే బాట పట్టారు. నవంబర్ నుంచి వరుసగా మూడు చిత్రాలు ప్రారంభించనున్నారు. 'సూయిధాగ్​' వంటి హిట్ తర్వాత ఆ స్థాయి చిత్రం పడలేదు వరుణ్ ధావన్​కు. 'కళంక్​', 'స్ట్రీట్​డాన్సర్' అనుకున్న స్థాయిలో ఆడలేదు.'కూలీ నెంబర్1' రిలీజ్​కు రెడీగా ఉంది.

ప్రస్తుతం మాల్దీవుల్లో సేదతీరుతున్న వరుణ్ నవంబర్ రెండో వారం నుంచి రాజ్​మెహతా తెరకెక్కిస్తున్న 'జుగ్​ జుగ్​ జియో' (వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్​కు హాజరవుతారు. ఇందులో కియారా అడ్వాణీ జోడీగా నటించనుంది. ఆ తర్వాత అమర్​కౌశిక్ రూపొందిస్తున్న హారర్​ కామెడీ సినిమా 'భేదియా', సాజిద్ నదియావాలా తీస్తున్న యాక్షన్ చిత్రం 'సంకి'.. షూటింగ్​ల్లో పాల్గొననున్నాడు వరుణ్.

ఇదీ చదవండి:సుశాంత్ కొత్త సినిమా షూటింగ్ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.