ETV Bharat / sitara

కోలుకున్నారు.. షూటింగ్​కు బయలుదేరారు - చిత్రీకరణ సమయంలో కరోనా

'జుగ్​ జుగ్​ జియో' సినిమా చిత్రీకరణ సమయంలో కరోనా బారినపడ్డారు బాలీవుడ్​ నటులు వరుణ్​ ధావన్​, నీతూ కపూర్​. తాజాగా కోలుకున్న వారు మళ్లీ షూటింగ్​కు పయనమయ్యారు.

Varun, Neetu, Kiara jet off to shoot Jug Jug Jeeyo
కోలుకున్నారు.. షూటింగ్​కు బయలుదేరారు!
author img

By

Published : Dec 18, 2020, 5:44 PM IST

బాలీవుడ్​ నటులు వరుణ్​ ధావన్​, నీతూకపూర్ కరోనా నుంచి కోలుకుని షూటింగ్​కు బయలుదేరారు. 'జుగ్​ జుగ్​ జియో' చిత్రీకరణ కోసం బయలుదేరుతుండగా.. ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. వారితో పాటుగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్న నటి కియారా అడ్వాణీ కూడా ఉంది. నీతూకపూర్​ కోలుకున్నప్పటికీ.. వరుణ్​ ఇంకా కొవిడ్​తో పోరాడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వరుణ్​ కనిపించడం వల్ల అవి పుకార్లేనని తేలింది.

కోలుకున్నారు.. షూటింగ్​కు బయలుదేరారు!

రాజ్​ మెహతా దర్శకత్వంలో 'జుగ్​ జుగ్​ జియో' తెరకెక్కుతోంది. డిసెంబర్​ ప్రారంభంలో దర్శకుడు సహా.. వరుణ్​ ధావన్​, నీతూ కపూర్​ కరోనా బారిన పడ్డారు. ఛండీగడ్​లో చిత్రీకరణ సమయంలో వీరికి వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం వీరంతా కోలుకున్న నేపథ్యంలో షూటింగ్​ తిరిగి ప్రారంభించనున్నారు. దర్శకుడు అందుబాటులో లేకపోయినా హీరోయిన్​ కియారా అడ్వాణీ, అనిల్​ కపూర్లపై సన్నివేశాలు తెరకెక్కించడానికి నిర్మాత సిద్ధమయ్యారని సమాచారం.

ఇదీ చూడండి:కట్ చెప్పినా ఏడుస్తూనే ఉన్నా: నుస్రత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.