ఆదివారం జరిగిన తెలుగు ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ గెలిచారు. ప్రత్యర్థి కొమర వెంకటేష్‌పై 18 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పీఎస్ ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు.. ఫిల్మ్ ఫెడరేషన్‌ను ఏ ఆశయాలతో కొనసాగించారో, అవే ఆశయాలతో సినీ కార్మిక వర్గాన్ని సంక్షేమ బాటలో తీసుకెళ్తామని నూతన అధ్యక్షుడు అనిల్ అన్నారు. కరోనా వల్ల అతలాకుతలమైన సినీ కార్మికులను ఆదుకోవడంపై తొలుత దృష్టి పెడతామని చెప్పారు. ఎన్నికైన కొత్త సభ్యులు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
![telugu film workers federation elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11698159_tcfc-2.jpeg)