ETV Bharat / sitara

వాలంటైన్స్ డే: ప్రేమికుల నోట.. పలకాలి ఈ పాట!

ప్రేమికుల దినోత్సవం.. ప్రేమికులు తమ భావాలను మరింతగా ఇచ్చిపుచ్చుకునే రోజు! అందుకోసం మాటలే కాకుండా పాటలూ ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల నుంచి తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న కొన్ని ప్రేమ గీతాలు మీకోసం.

Valentines day special these love feel songs you must listen
లవర్స్ డే: ప్రేమికుల నోట పలకాలి ఈ పాట!
author img

By

Published : Feb 14, 2021, 4:01 PM IST

ప్రేమ.. పలకడానికి రెండక్షరాలే. కానీ అందులో ఎంతో ఫీల్ ఉంటుంది. ఆ భావాన్ని చెప్పడానికి ప్రేమికులు పడే తపన అంతా ఇంతా కాదు. అయితే అలాంటి ప్రేమను చూపించేందుకు సినిమాలు ప్రయత్నిస్తుంటాయి. కొన్ని చిత్రాల్లోని పాటలు ప్రేమికుడి మనసు భావాలకు అర్థాలవుతాయి. ఆ పాటను వింటూ అతడు లోకాన్ని మైమరిచిపోయేలా చేస్తాయి. అందులోనూ టాలీవుడ్​ ఈ ప్రేమ పాటలకు చిరునామాగా మారింది! గత కొన్నేళ్లలో అలా ప్రేక్షకులు, ప్రేమికుల హృదయాల్ని హత్తుకున్న ప్రేమ పాటలపై ఓ లుక్కేద్దాం.

నీ కన్ను నీలి సముద్రం (ఉప్పెన)

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వైష్ణవ్​ తేజ్​ హీరోగా పరిచయమైన చిత్రం 'ఉప్పెన'. ఫిబ్రవరి 12న విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. ఈ సినిమాలో సంగీతం ప్రధానపాత్ర పోషించింది. 'నీ కన్ను నీలి సముద్రం' పాట సినిమా రాకముందే ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకుంది.

నీలి నీలి ఆకాశం (30 రోజుల్లో ప్రేమించడం ఎలా?)

యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయమైన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఇందులోని 'నీలి నీలి ఆకాశం' పాట ఇప్పటికీ అందరినీ అలరిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించగా, సిద్ శ్రీరామ్, సునీత గాత్రం ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించారు.

ఊహలే ఊహలే (జాను)

తమిళంలో ఘనవిజయం సాధించిన '96'కు తెలుగు రీమేక్ 'జాను'. ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలం. గోవింద్ వసంత ఇచ్చిన మ్యూజిక్ అలరించేలా ఉంటుంది. ఇందులో 'ఊహలే ఊహలే' పాట ఈ మూవీకి కీలకంగా నిలిచింది.

ఉండిపోవ నువ్వివా, నీ కన్నులు (సవారి)

నందు, ప్రియాంక శర్మ జోడీగా నటించిన చిత్రం 'సవారి'. శేఖర్ చంద్ర అందించిన సంగీతం అలరిస్తోంది. ఇందులోని 'ఉండిపోవా నువ్విలా', 'నీ కన్నులు' పాటలు శ్రోతల్ని అలరించాయి.

ఏమో ఏమో (రాహు)

అభిరామ్ వర్మ, క్రితి గార్గ్ జంటగా నటించిన చిత్రం 'రాహు'. ఈ సినిమాలోని సిద్ శ్రీరామ్ ఆలపించిన 'ఏమో ఏమో' సాంగ్ యువతకు బాగా కనెక్ట్ అయింది.

ఇదీ చూడండి:

సినిమాల్లో అలరించి.. బిజినెస్​మ్యాన్​ను పెళ్లాడి!

టాలీవుడ్​లో రూపొందిన ఉత్తమ ప్రేమకథా చిత్రాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.