ETV Bharat / sitara

'వకీల్​సాబ్'​ ట్రైలర్​ రిలీజ్​కు భారీస్థాయిలో ఏర్పాట్లు

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన వకీల్​సాబ్​ ట్రైలర్​ సోమవారం సాయంత్రం థియేటర్లలో విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 85 సినిమా హాల్స్​లో ఇది రిలీజ్​ కానుంది. అయితే ఈ ప్రచార చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు, పవన్​ అభిమానులు తప్పనిసరిగా మాస్క్​ ధరించి రావాలని థియేటర్ల యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

vakeel saab
వకీల్​సాబ్​
author img

By

Published : Mar 29, 2021, 11:19 AM IST

మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. బాలీవుడ్​లో విజయవంతమైన 'పింక్' చిత్రానికి రిమేక్​గా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 'వకీల్ సాబ్' ప్రచార చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ఏర్పాట్లు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రా, సీడెడ్, నైజాం సెంటర్లలోని సుమారు 85 థియేటర్లలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రచార చిత్రాన్ని లాంఛనంగా విడుదల చేస్తున్నారు. అయితే వకీల్ సాబ్ ప్రచార చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు, పవన్ కల్యాణ్ అభిమానులంతా తప్పనిసరిగా మాస్క్ ధరించి థియేటర్​కు రావాలని పలువురు థియేటర్ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులంతా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వకీల్ సాబ్ ప్రచార చిత్రాన్ని వీక్షించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'వకీల్​సాబ్​' ట్రైలర్​ అప్​డేట్​.. రికార్డుల మోతే ఇక?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.