'ఉప్పెన' చిత్రబృందం శుక్రవారం మొక్కల పండగలో పాల్గొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను కథానాయకుడు వైష్ణవ్ తేజ్, కథానాయిక కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబు స్వీకరించారు. వైష్ణవ్ తేజ్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో, కథానాయిక కృతిశెట్టి ముంబయిలోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. దర్శకుడు బుచ్చిబాబు కాకినాడలోని తన నివాసంలో ఈ హరిత కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 'ఉప్పెన' చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.
మొక్కలు నాటిన 'ఉప్పెన' జోడీ - కృతిశెట్టి వీడియోలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న 'ఉప్పెన' బృందం.. మొక్కలు నాటి తమ బాధ్యత నిర్వర్తించారు. ఇందులో హీరోహీరోయిన్తో పాటు దర్శకుడు పాల్గొన్నారు.