ETV Bharat / sitara

'ఉప్పెన' రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే? - వైష్ణవ్​ తేజ్​ ఉప్పెన

యువ కథానాయకుడు వైష్ణవ్​తేజ్​ హీరోగా పరిచయమవుతోన్న కొత్త చిత్రం 'ఉప్పెన'. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్రబృందం ప్రకటించింది.

uppena movie ready release on february 12
ఉప్పెన రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే?
author img

By

Published : Jan 26, 2021, 5:14 PM IST

Updated : Jan 26, 2021, 5:21 PM IST

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఉప్పెన' విడుదల తేదీ ప్రకటన వచ్చేసింది. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న రిలీజ్​ చేయనున్నట్లు మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా టీజర్​కు విశేష స్పందన లభిస్తోంది.

సుకుమార్​ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్​ సేతుపతి కీలకపాత్ర పోషించారు. గతేడాది ఏప్రిల్​ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో థియేటర్లలో సందడి 'ఉప్పెన' సిద్ధమైంది.

ఇదీ చూడండి: సల్మాన్​ సినిమా​కు పోటీగా జాన్​ అబ్రహం!

Last Updated : Jan 26, 2021, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.