స్టార్ నటీనటులకు కేవలం ప్రేక్షకుల్లోనే కాకుండా చిత్రపరిశ్రమలోని తారలూ వీరాభిమానులుగా ఉన్న సందర్భాలున్నాయి. అలా ఎవరో ఒక సీనియర్ హీరో లేదా హీరోయిన్ను ప్రేరణగా తీసుకుని ఎదగడం సహా వారి అభిమాన గణంలో ఒకరిగా ఉండిపోయారు. అదే విధంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు పెద్ద అభిమానినని యువ కథానాయిక కృతి శెట్టి అంటోంది. 'ఉప్పెన' సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్న ఈ నటి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెర్రీపై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచింది.
![Uppena fame Krithi Shetty is a big fan of this Mega hero!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9521503_krithi-shetty-3.jpg)
తాను సినిమాల్లోకి రాకముందు చరణ్ నటించిన ప్రతి చిత్రాన్నీ చూసిందట. మెగా ఫ్యాన్ అయిన ఈ భామకు అదే మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్‌తో 'ఉప్పెన' సినిమాకు ఛాన్స్ రావడం విశేషం. అయితే ఈ చిత్రం ఇంకా విడుదల కాకముందే ఆమెకు బోలెడన్నీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.