బాలీవుడ్ గాయని కనికా కపూర్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరోనా వచ్చినా, ఎవరికీ తెలియకుండా దాచడం సహా పలు పార్టీలకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీసీ 182, 269, 270 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీని ప్రకారం ఆరు నెలలు జైలుశిక్ష లేదంటే జరిమానా విధించొచ్చు. రెండూ కలిపి ఉండొచ్చు.
ఇటీవలే లండన్ వెళ్లి వచ్చిన ఈ సింగర్.. మూడు పార్టీలకు హాజరైంది. వీటిలో పలువురు రాజకీయ నాయకులు ఉన్నందున ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు కనికా హాజరైన పార్టీల సమాచారాన్ని సేకరించాలని లఖ్‌నవూ అధికారులను ఆదేశించారు కలెక్టర్. అలాగే 24 గంటల్లోగా దర్యాప్తు నివేదికను అందించాలని స్పష్టం చేశారు.