ETV Bharat / sitara

ప్రముఖ హీరోయిన్​ను​ చంపమని నిర్మాత మెయిల్​!

author img

By

Published : Mar 11, 2020, 8:09 PM IST

Updated : Mar 11, 2020, 9:41 PM IST

హాలీవుడ్​ నిర్మాత హార్వే వెయిన్​స్టీన్​.. లైంగిక వేధింపుల ఆరోపణలతో సతమతం అవుతున్నాడు. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే నేడు విచారణంలో భాగంగా న్యాయస్థానానికి ఫిర్యాదుదారు సమర్పించిన సాక్ష్యాధారాల్లో ఒకటి ఆసక్తి రేకెత్తిస్తోంది.

Unsealed court documents reveal Harvey Weinstein said Jennifer Aniston 'should be killed'
ప్రముఖ హీరోయిన్​ను​ చంపమని నిర్మాత మెయిల్​!

లైంగిక వేధింపుల కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలతో మరింత చిక్కులు ఎదుర్కోనున్నాడు హాలీవుడ్​ నిర్మాత హార్వే వెయిన్​స్టీన్​​. నేడు విచారణలో భాగంగా ఫిర్యాదుదారు ఓ ఈ మెయిల్​కు సంబంధించిన డాటాను న్యాయస్థానానికి అందజేసినట్లు తెలుస్తోంది. అందులో హాలీవుడ్​ నటి జెన్నిఫర్​ అనిస్టన్​ను చంపాలని వెయిన్​స్టీన్​​ చెప్పినట్లు ఉందట. 2017లో వెయిన్​స్టీన్​ ఓ మీడియా ప్రతినిధితో ఈ మాటలు చెప్పినట్లు తెలుస్తోంది.

తాజాగా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం త్వరలో తీర్పు వెలువరించనుంది. అమెరికాలోని మీడియా కథనాల ప్రకారం ఇతడికి 5 నుంచి 27 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని సమాచారం.

Unsealed court documents reveal Harvey Weinstein said Jennifer Aniston 'should be killed'
హార్వే వెయిన్​స్టీన్

గతంలో నటి జెన్నిఫర్​ అనిస్టన్​.. హార్వే వెయిన్​స్టీన్​ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు చేసింది. ఈమెతో పాటు దాదాపు 70 మంది మహిళలు ఇతడి బాధితులమని బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఈ ఘటన వల్లే 'మీటూ' ఉద్యమం ప్రారంభమైంది.

ఇదీ చూడండి.. 'హ్యారీ పోటర్​' హీరో డేనియల్​కు కరోనా?

Last Updated : Mar 11, 2020, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.